జాతీయ వార్తలు

ఆహా ఏమి అందాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థార్, మార్చి 12: అమెరికా విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ మధ్యప్రదేశ్‌లోని చారిత్రక నగరం మండు నగరంలో సోమవారం పర్యటించారు. జహాజ్ మహల్ తదితర ప్రాంతాలను ఆమె సందర్శించారు. పశ్చిమ మధ్యప్రదేశ్‌లో మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆమె ఇక్కడకు వచ్చారు. మండు ప్రాంతంలోని చారిత్రక ప్రాంతాల్లో రెండు గంటలపాటు హిల్లరీ గడిపారు. తలపై క్రీడాకారుల టోపీ, సన్‌గ్లాస్ కళ్లద్దాలు ధరించిన హిల్లరీ జహాజ్ మహల్‌ను సందర్శించారు. మండు సుల్తాన్ ఘియాస్ ఉద్దీన్ ఖిల్జీ హయాంలో దీన్ని నిర్మించారు. ఈ చారిత్రక నిర్మాణాలు చూసి తానెంతో ఎంజాయ్ చేశానని మీడియాకు హిల్లరీ చెప్పారు. ‘ఇక్కడ శిల్పకళావైభవం చూస్తే భారత్ ఔన్నత్యం తెలుస్తుంది. పురావస్తు సంపద భారత చరిత్రను కళ్లకుకట్టినట్టు ఉంది. అందమైన నిర్మాణాలు, ప్యాలెస్ ప్రాంగణం ననె్నతో మగ్దురాలిని చేసింది’ అని ఆమె పేర్కొన్నారు. 15 శతాబ్దంలో మండుకోట నిర్మాణమైంది. హిల్లరీకి ప్రత్యేక వంటకాలు తయారు చేయించారు.