జాతీయ వార్తలు

కువైట్‌లో ఆంధ్రుల ఉరిశిక్ష తగ్గించేందుకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 7: మాదక ద్రవ్యాల కేసులో కువైట్‌లో ఉరిశిక్ష పడిన 14 మంది తెలుగు వారికి శిక్ష తగ్గించేలా చర్యలు చేపడతామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ హామీ ఇచ్చినట్లు మాజీ కేంద్ర మంత్రి పురంధ్రీశ్వరి చెప్పారు. ఆమెతో పాటుగా భాజపా నాయకులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, రమేష్‌నాయుడు, రఘురామ్ తదితరులు మంత్రి సుష్మాస్వరాజ్‌ను గురువారం కలిశారు. అనంతరం పురంధ్రీశ్వరి మాట్లాడుతూ, రాయలసీమ జిల్లాలకు చెందిన 14 మంది కువైట్ దేశంలోడ్రగ్స్ కేసులో అరెస్టు అయితే వారికి ఆ దేశం ఉరిశిక్ష విధించిందని, వారికి శిక్ష తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని కోరినట్లు తెలిపారు. అవకాశం ఉంటే యావజ్జీవ శిక్ష మన దేశంలో అనుభవించే విధంగా చూడాలని కేంద్రమంత్రిని కోరినట్లు చెప్పారు.