జాతీయ వార్తలు

మీ భద్రత మా బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూలై 9: భారతీయ పర్యాటకులకు భద్రత కల్పిస్తామని ఎలాంటి భయాందోళనకు గురికావద్దని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధాని ఢాకాలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడుల నేపథ్యంలో బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఈ మేరకు భరోసా ఇచ్చారు. ‘దేశంలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడులు అత్యంత దురదృష్టకరం. ఇలాంటివి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. పర్యాటకుల్లో భయాలు పొగొట్టి వారి భద్రతకు చర్యలు తీసుకుంటామని హసీనా భరోసా ఇచ్చారు’ అని బంగ్లాదేశ్ పౌర విమానయాన, టూరిజం శాఖ సంయుక్త కార్యదర్శి జ్యోతిర్మయ్ బర్మన్ వెల్లడించారు. కోల్‌కతాలో ‘ట్రావెల్ అంట్ ట్రైడ్ ఫెయిర్’లో బర్మన్ మాట్లాడుతూ భారతీయ పర్యాటకులను తమ దేశంలో పూర్తి రక్షణ ఉంటుందని చెప్పారు. ఇటీవలి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. బెంగాలీ మాట్లాడే పర్యాటకులను ఆకర్షించేందుకు బంగ్లా ప్రభుత్వం టూర్ ఆపరేటర్లకోసం మూడు రోజుల కార్యక్రమం చేపట్టనుంది. ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం సందర్భంగా దీనికి శ్రీకారం చుడతామన్నారు. తొలి పర్యటన ఫిబ్రవరి 20న మొదలై 22తో పూర్తవుతుంది. బంగ్లాదేశ్‌లో ప్రముఖ పర్యాటక కేంద్రాల సందర్శన, రుచికరమైన వంటకాలు భారత పర్యాటకులకు అందజేస్తారని జ్యోతిర్మయ్ తెలిపారు. కోల్‌కతా, సిలిగురి, అగర్తలా, గౌహతి నుంచి రైళ్లు, బస్సులో రిజర్వేషన్ సదుపాయంతో రావచ్చన్నారు. అలాగే ఢిల్లీ నుంచి నేరుగా విమాన సర్వీసులు ఉంటాయన్నారు.