జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో మళ్లీ హింసాకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఆగస్టు 16: జమ్మూ, కాశ్మీర్‌లో మంగళవారం మళ్లీ హింసాకాండ చెలరేగింది. కర్ఫ్యూ, పోలీసు ఆంక్షలు, వేర్పాటువాదుల ఆందోళనల కారణంగా రాష్ట్రంలో 39 రోజులుగా సాధారణ జనజీవితం స్తంభించిపోయింది. బుద్గాం, అనంత్‌నాగ్ జిల్లాల్లో రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో అయిదుగురు మృతిచెందారు. దీంతో కాశ్మీర్‌లో ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లలో మృతిచెందిన వారి సంఖ్య 63కు చేరుకుంది. బుద్గాం జిల్లా మాగంలోని అరిపఠాన్‌లో రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులను ఆదుపు చేయడానికి సిఆర్‌పిఎఫ్ జవాన్లు జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందగా, మరో అయిదుగురు గాయపడ్డారని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. చనిపోయిన వారిని జావేద్ అహ్మద్, మన్జూర్ అహ్మద్, మహమ్మద్ అషఫ్,్ర కౌసర్ షేక్‌లు గురించినట్లు ఆయన చెప్పారు. మంగళవారం ఉదయం ఆ మార్గంలో వెళ్తున్న సిఆర్‌పిఎఫ్ వాహనంపై జనం రాళ్లు రువ్వినప్పుడు ఈ సంఘటన జరిగిందని ఆ అధికారి తెలిపారు. అనంత్‌నాగ్ జిల్లా జంగ్లట్ మండీ ప్రాంతంలో జరిగిన మరో సంఘటనలో మరో వ్యక్తి చనిపోగా, నలుగురు గాయపడ్డారు. రాళ్లు రువ్వుతున్న కొంతమంది యువకులను చెదరగొట్టడానికి భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో అయిదుగురు గాయపడ్డారని, గాయపడ్డ వారిని ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ అమీర్ యూసఫ్ అనే వ్యక్తి చనిపోయాడని ఆ అధికారి చెప్పారు.
మొత్తం శ్రీనగర్ జిల్లా, అనంత్‌నాగ్ పట్టణాల్లో కర్ఫ్యూ ఇంకా అమలులో ఉండడంతో, కాశ్మీర్‌లోయలోని మిగతా ప్రాంతాల్లో ఆంక్షల కారణంగా వరసగా 30వ రోజు కూడా సాధారణ జనజీవితం స్తంభించిపోయింది. పౌరుల హత్యలకు వ్యతిరేకంగా కాశ్మీర్‌లోయలోని ప్రధాన మార్కెట్ ప్రాంతాల్లో వ్యాపారుల ధర్నాలు నిర్వహించాలన్న వేర్పాటువాదుల ఆలోచనలను భగ్నం చేయడానికి కర్ఫ్యూ, ఆంక్షలను విధించినట్లు ఆ అధికారి చెప్పారు. స్కూళ్లు, కాలేజీలు, ప్రైవేటు కార్యాలయాలు మూతపడి ఉండగా, వేర్పాటువాదులు ఇచ్చిన బంద్ కారణంగా రోడ్లపై ప్రైవేటు వాహనాలు తిరగలేదు. శనివారం సాయంత్రంనుంచి బ్రాడ్‌బ్యాండ్ సేవలు నిలిచిపోగా, అదేరోజు రాత్రి పొద్దుపోయాక మొబైల్ టెలిఫోన్ సర్వీసులను సైతం ఆపేశారు.

చిత్రాలు.. బుద్గాం జిల్లాలో మంగళవారం జరిగిన పోలీసు కాల్పుల్లో మృతిచెందినవారి అంతిమయాత్రలో నినాదాలిస్తున్న కాశ్మీరీలు. శ్రీనగర్‌లో బందోబస్తు నిర్వహిస్తున్న భద్రతా దళాలు