జాతీయ వార్తలు

పేదలకు పర్యావరణ న్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐక్యరాజ్య సమితి, ఏప్రిల్ 23: పర్యావరణ పరిరక్షణకు కుదిరిన చరిత్రాత్మక పారిస్ ఒప్పందం అమలుకు ప్రపంచ దేశాలు చేపట్టే కార్యాచరణ ప్రణాళిక ప్రపంచంలోని పేదలకు పర్యావరణ న్యాయం లభించేలా చూడడంతో పాటుగా ప్రకృతి వనరుల వినియోగంలో నిలకడతనాన్ని తీసుకు రావడంపైన ప్రధానంగా దృష్టి పెట్టాలని భారత్ సూచించింది. శుక్రవారం ఇక్కడ ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సంతకాల కార్యక్రమం సందర్భంగా చరిత్రాత్మక పారిస్ ఒప్పందంపై భారత్ సహా 171 దేశాలు సంతకాలు చేశాయి. మన దేశం తరఫున కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ ఈ ఒప్పందంపై సంత కం చేశారు. ధరిత్రీ దినోత్సవం అయిన ఈ రోజున మనం చరిత్ర సృష్టించాం. ఇది మనందరి ఉమ్మడి దూరదృష్టి విజయం’ అని జవడేకర్ ఐరాసకు ఇచ్చిన ఓ ప్రకటనలో అన్నారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో 175 దేశాలు పారిస్ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇది ఒక చరిత్రాత్మక దినమని, ఎందుకంటే ఒక అంతర్జాతీయ ఒప్పందంపై ఒకే రోజు ఇన్ని దేశాలు సంతకం చేయడం ఇదే మొదటిసారని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి-మూన్ అన్నారు.