జాతీయ వార్తలు

బాకీ ఎగవేతదార్లను వదిలిపెట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఫిబ్రవరి 28: బ్యాంకు రుణాల ఎగవేతదారులను వదిలిపెట్టేదిలేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. బ్రిటన్ పర్యటనలో ఉన్న జైట్లీ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా అంశాన్ని లేవనెత్తే అవకాశాలున్నాయి. ‘ఈ అవకాశాన్ని కచ్చితంగా వినియోగించుకుంటాం. రుణాలు తీసుకుని ఎగవేసి తప్పించుకుతిరుగుతున్నవారి విషయంలో కఠినంగానే ఉన్నాం. బ్రిటన్ ఆర్థిక మంత్రితో దీనిపై మాట్లాడతా’ అని మీడియా సమావేశంలో వెల్లడించారు. బ్రిటన్ పర్యటనపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు జైట్లీ బదులిస్తూ ‘డిఫాల్టర్ల విషయాన్ని భారత్ తీవ్రంగా పరిగణిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగవేతదారులను ఉపేక్షించబోం’ అని స్పష్టం చేశారు. యుకె ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రితో జైట్లీ సమావేశమయ్యారు. డిఫాల్టర్లను వదిలిపెట్టేది లేదని, ఇప్పటికే వారికి గట్టి సంకేతాలు పంపామని జైట్లీ తెలిపారు. రుణ బకాయిల రికవరీకి బ్యాంకులు తీసుకునే చర్యలకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఎగవేతదారులనుంచి సొమ్ము రికవరీకి అనేక చర్యలు చేపట్టామని, అయితే కొందరు దేశం విడిచిపారిపోయారని ఆయన చెప్పారు. డిఫాల్టర్లు ఎక్కడ దాక్కున్నప్పటికీ వదలిపెట్టేది లేదని, వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆర్థిక మంత్రి అన్నారు. ఆస్తుల అటాచ్‌మెంట్‌సహా పలు మార్గాలద్వారా సొమ్ములు రికవరీకి దర్యాప్తు సంస్థలు చర్యలు చేపట్టాయని ఆయన స్పష్టం చేశారు. భారత్ వదలి వచ్చేసిన ఎగవేతదారులను చట్టప్రకారమే రప్పిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. లిక్కర్ కింగ్, కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధిపతి విజయ్ మాల్యా బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగవేసి లండన్ వచ్చేశారు. మాల్యా గత ఏడాది మార్చినుంచి లండన్‌లోనే ఉంటున్నారు. మనీలాండరింగ్‌సహా అనేక కేసులును మాల్యా ఎదుర్కొంటున్నారు. కాగా విజయ్ మాల్యాను తమకు అప్పగించాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని ఇటీవలే భారత్ కోరింది. ఇలా ఉండగా భారతీయ విద్యార్థుల పట్ల ఉదారంగా ఉండాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని జైట్లీ కోరారు. గత కొనే్నళ్లుగా బ్రిటన్ యూనివర్శిటీలకు వచ్చే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.