జాతీయ వార్తలు

కరాచీలో నక్కిన అల్ జవహరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, ఏప్రిల్ 22: ప్రపంచంలోని అత్యంత కరడుగట్టిన ఉగ్రవాదుల్లో ఒకడైన అల్‌ఖైదా నాయకుడు అల్ జవహరి ప్రస్తుతం కరాచీలో దాక్కున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) అతనికి పటిష్టమైన భద్రత కల్పిస్తున్నట్లు అమెరికా మీడియాలో వచ్చిన కథనం స్పష్టం చేస్తోంది. అమెరికా బలగాలు 2001లో అఫ్గానిస్తాన్ నుంచి అల్‌ఖైదాను తరిమికొట్టిన నాటినుంచి అల్ జవహరిని పాక్ గూఢచార సంస్థ కంటికి రెప్పలా కాపాడుతోందని, ప్రస్తుతం అతను అరేబియా సముద్ర తీరప్రాంత నగరమైన కరాచీలో ఉంటున్నట్లు వివిధ వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారాన్ని బట్టి స్పష్టమవుతోందని ‘న్యూస్‌వీక్’ వార పత్రిక పేర్కొంది. పాక్‌లో అమెరికా బలగాలు నిర్వహించిన మెరుపు దాడిలో హతమైన అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌కు గురువైన అల్ జవహరి ఆచూకీ గురించి వార్తా కథనం వెలువడటం చాలా ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.
అయితే ఎప్పటి మాదిరిగానే ఇప్పుడు కూడా అల్ జవహరి కచ్చితంగా ఎక్కడ ఉన్నాడో చెప్పేందుకు బలమైన ఆధారాలేమీ లేవని అమెరికా గూఢచార సంస్థ సిఐఎ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) వెటరన్ అధికారి బ్రూస్ రీడెల్ (30) ‘న్యూస్‌వీక్’తో అన్నారు. దక్షిణాసియాతోపాటు మధ్యప్రాచ్య దేశాల వ్యవహారాలకు సంబంధించి రీడెల్ గత నలుగురు అమెరికా అధ్యక్షులకు ఉన్నత సలహాదారుగా వ్యవహరించారు.