జాతీయ వార్తలు

ఐపిఎస్ అధికారిపై అత్యాచారం కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, డిసెంబర్ 26: యుపిఎస్‌సి పరీక్షకు సిద్ధమవుతున్న యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర క్యాడర్ ఐపిఎస్ అధికారి లోహిత్ మితానీపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. 2013 ఐపిఎస్ బ్యాచ్‌కు చెందిన మితానీ పెళ్లి పేరుతో తనను గత ఆగస్టులో తుకోగంజ్ ఏరియాలోని హోటల్‌కు పిలిపించుకుని అత్యాచారానికి ఒడిగట్టడంతోపాటు ఆ తర్వాత కూడా తనపై పలుసార్లు అత్యాచారం జరిపాడని జబల్పూర్‌కు చెందిన బాధిత యువతి ఫిర్యాదు చేసినట్లు ఇండోర్ తూర్పు ఎస్పీ ఓపి.త్రిపాఠి తెలిపారు. బాధితురాలితో ‘ఫేస్‌బుక్’ ద్వారా పరిచయం ఏర్పరచుకున్న మితానీ యుపిఎస్‌సి పరీక్షకు సిద్ధమవడంలో ఆమెకు సహాయాన్ని అందజేస్తానని నమ్మబలికి ఈ దారుణాలకు పాల్పడ్డాడని, ఇటీవల ఇండోర్‌కు బదిలీ అయిన మితానీపై ఐపిసిలోని సెక్షన్ 376 (అత్యాచారం), సెక్షన్ 417 (వంచన) కింద జబల్పూర్‌లో కేసు నమోదు చేసినట్లు త్రిపాఠి తెలిపారు. కాగా, ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని తెలిపారు.