జాతీయ వార్తలు

అమేథీ ప్రజలకు ధన్యవాదాలు:స్మృతి ఇరానీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఒడించి దాదాపు 55వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచిన స్మృతి ఇరానీ ట్విట్టర్ ద్వారా అమేథీ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ చేసిన అభివృద్ధి పనులపై విశ్వాసం ఉంచి గెలిపించారంటూ పేర్కొన్నారు. ఈరోజు అమేథీకి నవోదయం..సరికొత్తసంకల్పం అంటూ ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. కాంగ్రెస్ కంచుకోట అయిన అమేథీలో రాహుల్‌ను ఓడించి గెలుపొందటం అంటే సామాన్య విషయం కాదు. గత ఎన్నికల్లోనూ స్మృతిఇరానీ ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాని రాహుల్‌కి గట్టి పోటీ ఇచ్చి కాంగ్రెస్ ఓట్ల శాతాన్ని బాగా తగ్గించగలిగారు. ఈసారి కూడా బీజేపీ అధిష్టానం స్మృతి ఇరానీనే నిలబెట్టింది. ఈసారి ఇరానీ కాంగ్రెస్ కంచుకోటను బద్దలుకొట్టి మంచి మెజార్టీతో గెలుపొందారు. కాగా ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ బలమైన పార్టీగా ఉండేది. కాని నేడు ఈ రాష్ట్రంలో ఒకేఒక సీటుకు పరిమితమైంది. అదీ యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ పోటీ చేసిన రాయబరేలి.