జాతీయ వార్తలు

జాతి వ్యతిరేక చర్యలను సహించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: పార్లమెంటుపై దాడి కేసులో దోషి అయిన అఫ్జల్ గురును ఉరితీయడానికి వ్యతిరేకిస్తూ ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీలో నిరసన ర్యాలీ నిర్వహించడంపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జెఎన్‌యు క్యాంపస్‌లో జరిగిన కార్యక్రమంలో కొంతమంది విద్యార్థులు భారత వ్యతిరేక నినాదాలు చేయడాన్ని శుక్రవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో రాజ్‌నాథ్ ప్రస్తావిస్తూ , ఇలాంటి సంఘటనలను ఎంతమాత్రం సహించబోమని అన్నారు. ఈ సంఘటనతో సంబంధం వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ఆయన చెప్పారు. ‘ఎవరైనా భారత వ్యతిరేక నినాదాలు చేసినా, దేశ సమైక్యత, సమగ్రతలను దెబ్బతీయడానికి ప్రయత్నించినా వారిని వదిలిపెట్టేది లేదని, వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.
కాగా, అఫ్జల్ గురును ఉరి తీయడాన్ని వ్యతిరేకిస్తూ జెఎన్‌యులో నిరసన ప్రదర్శన నిర్వహించడాన్ని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ సైతం తీవ్రంగా ఖండిస్తూ, భరత మాతకు అవమానం జరిగితే దేశం సహించబోదన్నారు. ఈరోజు (వసంత పంచమి) సరస్వతీ దేవిని పూజించే రోజు. దేశ సంక్షేమం, ప్రగతిని కాక్షించే ప్రతి కుటుంబంపైనా సరస్వతీ దేవి కటాక్షం ఉంటుంది అని మాత్రమే నేను చెప్పగలను’ అని జెఎన్‌యు ఘటనలపై విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా స్మృతి ఇరానీ అన్నారు. అంతకు ముందు స్మృతి ఇరానీ విద్యాభారతి, అఖిల భారతీయ శిక్షా సంస్థాన్‌ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ జెఎన్‌యులో జరిగిన సంఘటనలపై పరోక్ష విమర్శలు చేశారు. విద్యార్థులు వందేమాతరం గానం చేయడం విన్నప్పుడు తనకెంతో సంతృప్తి కలుగుతుందని, దేశ వ్యతిరేక నినాదాలు చేయడం కాక, దేశం కోసం ప్రార్థించమని విద్యార్థులకు చెప్పే ఉపాధ్యాయులున్నందుకు తనకు ఎంతో సంతృప్తి కలుగుతోందని ఆమె అన్నారు. ఒక డాక్టర్, లేదా ఇంజనీరు తప్పు చేస్తే దాన్ని సరిచేయవచ్చని, అయితే ఒక ఉపాధ్యాయుడు చేసే తప్పునకు మొత్తం సమాజం మూల్యం చెల్లించాల్సి వస్తుందని కూడా ఆమె అన్నారు. అఫ్జల్ గురు, మక్బూల్ భట్‌లకు న్యాయస్థానాలు ఉరిశిక్షలను విధించడాన్ని నిరసిస్తూ, స్వయం నిర్ణయాధికారం కోసం కాశ్మీర్ ప్రజలు జరుపుతున్న పోరాటానికి సంఘీభావం తెలియజేయడం కోసం జెఎన్‌యులోని సబర్మతి ధాబావద్ద జరిగే నిరసన ప్రదర్శనలో పాల్గొనాలంటూ కొంతమంది విద్యార్థులు ఈ వారం యూనివర్సిటీ అంతటా పోస్టర్లు అతికించడంపై వివాదం తలెత్తిన నేపథ్యంలో స్మృతి ఇరానీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. యూనివర్సిటీ ఈ సంఘటనపై దర్యాప్తుకు ఒక కమిటీని నియమించింది కూడా. మరోవైపు బిజెపి ఎంపి మహేశ్ గిరి, బిజెపి విద్యార్థి విభాగం ఎబివిపి చేసిన ఫిర్యాదుపై పోలీసులు గురువారం గుర్తు తెలియని విద్యార్థులపై దేశద్రోహం కేసు సైతం నమోదు చేశారు.