జాతీయ వార్తలు

జవాబులివ్వను..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: ముంబయి ఉగ్రవాద దాడుల ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన లష్కరే తోయిబా ఉగ్రవాది, పాకిస్తానీ అమెరికన్ డేవిడ్ హెడ్లీకి సంబంధించి జాతీయ దర్యాప్తు బృందం (ఎన్‌ఐఏ) వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి అమెరికాలో ఉంటున్న అతని భార్య, వ్యాపార భాగస్వామి నిరాకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా జైల్లో ఉన్న హెడ్లీకి సంబంధించి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ఎన్‌ఐఏ అమెరికా న్యాయ శాఖ ద్వారా హెడ్లీ భార్య షాజియా, అతని వ్యాపార భాగస్వామి రేమండ్ శాండర్స్‌ను కోరిందని, అయితే వ్యక్తిగత కారణాన్ని చూపించి వారు ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి నిరాకరించారని అధికార వర్గాలు తెలిపాయి. అమెరికా చట్టం ప్రకారం ఈ కేసులో ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా నిందితులు కానందున విదేశీ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజన్సీ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి అంగీకరించడం లేదా తిరస్కరించడం చేయవచ్చు. హెడ్లీ తన కుటుంబానికి సంబంధించిన సమాచారం ఏదీ చెప్పడం లేదని, అలాగే భారత్‌లో హెడ్లీ కార్యకలాపాలు, అలాగే లష్కరే తోయిబాతో అతనికున్న సంబంధాల గురించి వారికి తెలిసి ఉంటుందని దర్యాప్తు అధికారులు భావించడంతో వారు ఆ ఇద్దరిని ప్రశ్నించాలని అనుకున్నారు. 2010లో అమెరికాలో ఎన్‌ఐఏ హెడ్లీని ప్రశ్నించిన విషయం తెలిసిందే. హెడ్లీ తన కుటుంబ సభ్యుల గురించి ఎలాంటి ప్రశ్నలను అడగవద్దని స్పష్టంగా చెప్పినట్లు అప్పుడు హెడ్లీని ప్రశ్నించిన ఎన్‌ఐఏ రూపొందించిన 106 పేజిల నివేదికలో పేర్కొన్నారు. అయితే చికాగో కోర్టు రికార్డుల ప్రకారం హెడ్లీ భార్య షాజియా టీవీలో 26/11 ముంబయి దాడులను రోజంతా చూడడమే కాకుండా దాడులు విజయవంతమయినందుకు హెడ్లీని అభినందిస్తూ ఒక మెస్సేజి కూడా పంపించింది.