జనాంతికం - బుద్దా మురళి

కరోనా - దోమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అప్పుడే చెబుతున్నాను విన్నారా? మూడు రాజధానులు మనకు అచ్చిరావని చెప్పినా వినలేదు’’
‘‘ఏమైందంటావేం? ఏమైందని అంత మెల్లగా అడుగుతున్నావు. ఏం జరుగుతుందో నీకు కనిపించడం లేదా?’’
‘‘తెలియకే కదా? అడుగుతున్నది?’’
‘‘స్టాక్ మార్కెట్ పేక మేడలా కూలిపోయింది. నీకు కనిపించడం లేదా?’’
‘‘ఏదో ఆదాయం పన్ను రాయితీ కోసం మ్యూచువల్ ఫండ్స్‌లో కొంత పొదుపు చేయడం తప్ప స్టాక్ మార్కెట్ గురించి పెద్దగా పట్టించుకోలేదు’’
‘‘నీలాంటి వాళ్లు ఇలా పట్టించుకోక పోవడం వల్లనే రాజధానులను ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారు. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. మనిషన్నాక కాసింత కళాపోషణ ఉండాలని ఆ రోజుల్లో అన్నారు. ఈ రోజుల్లో మనిషన్నాక కాసింత స్టాక్ మార్కెట్ జ్ఞానం ఉండాలి.’’
‘‘మరీ స్టాక్ మార్కెట్ అంటే ఏమీ తెలియదనేం కాదు. గతంలో ఇనె్వస్ట్ చేశాను. మార్కెట్ ఇలానే పడిపోయాక. ఆసక్తి తగ్గిపోయింది. స్టాక్ మార్కెట్ అంటే వైరాగ్యం కలిగి అటు వైపు చూడడం మానేశాను. అంతే తప్ప మార్కెట్ గురించి అస్సలే తెలియదని కాదు.’’
‘‘మన దేశ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి సూచిక లాంటిది స్టాక్ మార్కెట్ ఒకే సారి మూడువేల పాయింట్స్ పడిపోవడం అంటే పాలకులు ఎలా ఉన్నారో, పాలకులపై ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుస్తూనే ఉంది’’
‘‘అదేంటోయ్! పంచాయితీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు అయినా ప్రభుత్వానికి రిఫరెండం పని తీరుకు తీర్పు అంటే ఓ అర్థం ఉంది. స్టాక్ మార్కెట్ ఇండెక్స్‌కు పాలకుల పనితీరుకు సంబంధం ఉంటుందా?’’
‘‘ఎందుకు ఉండదు, ఉంటుంది.. ఉండి తీరుతుంది. 2008లో ఓసారి స్టాక్ మార్కెట్లు ఇలానే ఘోరంగా పడిపోయాయి. అప్పుడు రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు. ఇప్పుడు 2020లో మరోసారి అలానే పడిపోయాయి. ఇప్పుడెవరు అధికారంలో ఉన్నారు..’’
‘‘మీ అభిమాన నాయకుడు మాత్రం అధికారం లేడు, చక్రం తిప్పడం లేదు..’’
‘‘అదే చెబుతున్నాను. అందుకే మార్కెట్లు ఇంత ఘోరంగా పడిపోయాయి. చక్రం తిప్పితే ఇండెక్స్ ఆకాశంలోకి దూసుకు వెళ్లేది..’’
‘‘మీ రాష్ట్రంలో మీ నాయకుడి ప్రభావం ఉంటుంది. స్థానిక రాజకీయాల వల్ల అనకాపల్లి మార్కెట్‌లో బెల్లం ధర పడిపోయింది అంటే అర్థం ఉంది కానీ స్టాక్ మార్కెట్‌కు మీ లోకల్ పాలిటిక్స్‌కు సంబంధం ఉంటుంది అంటావా?’’
‘‘కరోనా వైరస్‌తో ప్రపంచం వణికిపోతుందని మీడియా ఘోషిస్తోంది. వినపడుతుందా?’’
‘‘వినబడక పోవడం ఏంటి? కలిసి చాలా రోజులైంది. మాట్లాడదామని ఉదయం నీకు కాల్ చేస్తే... తొలుత దగ్గు వినిపించింది. పాపం క్షమించుగాక. అదేమైనా కరోనా దగ్గా? నీకేమైనా కరోనా వచ్చిందా? అని భయపడిపోయాను. అనకూడదు కానీ సెల్‌ఫోన్‌లో కరోనా వ్యాపించే ప్రమాదం ఉందని కాల్ కట్ చేశాను. తరువాత మరో కాల్ చేసినప్పుడు కరోనాపై ప్రజలను అప్రమత్తం చేయడానికి అది కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కాలర్ ట్యూన్ అని అర్థమైంది..’’
‘‘అంత చిన్న కరోనా వైరస్ ప్రభావం ప్రపంచంపై ఉన్నప్పుడు చక్రం తిప్పిన వారి ప్రభావం దేశంపై ఉండదంటావా?’’
‘‘ఏమో నాకు అంతగా తెలియదు కానీ... మూడు రాజధానుల నిర్ణయానికి స్టాక్ మార్కెట్ కూలిపోవడానికి సంబంధం ఉంది అంటే నమ్మలేకపోతున్నాను..’’
‘‘అంతేలే నువ్వేందుకు నమ్ముతావు. టీవి ఆన్ చేసి చూడు స్టాక్ మార్కెట్ ఎలా కూలిపోతుందో. ఒకే రోజు బిఎస్‌సి ఇండెక్స్ మూడువేల పాయింట్స్ పడిపోయింది. చరిత్రలో ఇంతకు ముందెన్నడన్నా ఇలా జరిగిందా?’’
‘‘2008లో కూడా ఇలానే పడిపోయిందంటున్నారు..’’
‘‘అప్పుడు ఇలానే కాదు ఇంత కన్నా ఎక్కువ పడిపోయింది. కానీ ఒకే రోజు మూడు వేల పాయింట్స్ ఎప్పుడూ పడిపోలేదు. దశల వారిగా పడిపోయింది. చరిత్రలో ఇదో రికార్డు..’’
‘‘అంటే మూడు రాజధానుల నిర్ణయమే దీనికి కారణం అంటావు’’
‘‘నేను అనడం కాదు... నీకు కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది కదా? కళ్ల ముందు కనిపించినా నమ్మవా?’’
‘‘త్రి రాజధాని నిర్ణయం వల్ల ఏకరాజధానిలో రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటే ఏమో అనుకోవచ్చు. కానీ స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోవడానికి దీనికి సంబంధం ఏమిటో?’’
‘‘అంతేలే మనకు నచ్చని విషయాలను ఎన్ని ఆధారాలు ఉన్నా నమ్మం..’’
‘‘చూడోయ్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోవడం ఒక్క మన దేశంలోనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. అమెరికా మార్కెట్లు మన కన్నా ఎక్కువ పడిపోయాయి. స్టాక్ మార్కెట్లు ప్రపంచంలో ఏయే దేశాల్లో ఉన్నాయో అన్ని దేశాల్లో ఘోరంగా పడిపోయాయి. ఇంతకు ముందు మనం గృహ నిర్బంధం గురించి విన్నాం కదా? తొలి సారిగా దేశం మొత్తం నిర్బంధంలో ఉంది. ఇటలీ నుంచి ఎవరినీ బయటకు పోనివ్వడం లేదు. ఇటలీలోకి రానివ్వడం లేదు. చదువు కోసమో, ఉద్యోగం కోసమే ఆ దేశానికి వెళ్లిన చాలా మంది అక్కడ చిక్కుకుపోయారు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు ఆ దేశం నిర్బంధం అమలు చేస్తోంది. ప్రపంచాన్ని వణికించే అమెరికా సైతం కరోనాకు వణికితోంది. ఒక్క ఇంగ్లాండ్ దేశం మినహా మరే యూరప్ దేశం నుంచి కూడా ఎవరినీ తమ దేశంలో అడుగు పెట్టనివ్వకుండా అమెరికా ఆంక్షలు విధించింది. మన దేశం కూడా విదేశీయులు ఎవరూ రాకుండా వీసాలపై నిషేధం విధించింది. కరోనా పుణ్యమా అని విమానయాన సంస్థలు, టూరిజం, స్టాక్ మార్కెట్లు, వ్యాపారం అన్నీ పడకేశాయి..’’
‘‘అంటే కరోనా వల్లనే ఇదంతా అంటావు తప్ప రాజధానుల ప్రకటన అంటే ఒప్పుకోవా?’’
‘‘సర్లేవోయ్ రాజధానుల ప్రకటనల వల్లనే ప్రపంచ మార్కెట్లు కుప్పకూలాయి అని నువ్వు ప్రచారం చేసుకో... నేను వద్దంటానా?’’
‘‘వద్దనవు కానీ ఒప్పుకోవన్న మాట..’’
‘‘ అదేదో సినిమాలో నానాపటేకర్ ఏక్ మచ్చర్‌నే ఆద్మీకో హిజ్‌డా బనాదియా అంటాడు ఆ డైలాగు గుర్తుకు వస్తుంది..’’
‘‘ఎందుకు?’’
‘‘చిరాకు పెట్టే దోమను చంపడానికి మనం చప్పట్లు కొట్టినట్టు రెండు చేతలు ఒక చోటుకు తెస్తాం కదా? అంటే అచ్చం హిజ్‌డాలు చప్పట్టు కొట్టినట్టు. ఇప్పుడు దోమకన్నా చిన్నదైన వైరస్ మొత్తం ప్రపంచానే్న వణికిస్తోంది. నానా పాటేకర్ ఇప్పుడు సాలా ఏక్ వైరస్‌నే పూరీ దునియోకో హిజ్‌డా బనాదీయా అంటాడేమో...

buddhamurali2464@gmail.com