జాతీయ వార్తలు

హర్యానాలో ఆగని విధ్వంసకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్: రిజర్వేషన్ల కోసం ఆందోళన చేస్తున్న జాట్ కులస్థులు సోమవారం కూడా పలు చోట్ల విధ్వంసకాండ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రోహ్తక్ జిల్లాలో పరిస్థితి దిగజారింది. సోమవారం ఆందోళనకారులు ఓ గూడ్సురైలులో నాలుగు బోగీలకు, ఓ న్యాయమూర్తి కారుకు నిప్పు పెట్టారు. అనేక ప్రాంతాల్లో రోడ్లను దిగ్బంధించడంతో అక్కడికి చేరుకునేందుకు భద్రతాదళాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. రవాణా వ్యవస్థ స్తంభించడంతో నిత్యావసర సరకులు, పాలు, కూరగాయలు అందక జనం అవస్థలు పడుతున్నారు. రిజర్వేషన్లపై ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హామీ ఇస్తే తప్ప ఆందోళన విరమించే ప్రసక్తి లేదని జాట్ కులస్థులు తెగేసి చెబుతున్నారు.