జాతీయ వార్తలు

విభజన చట్టాన్ని సవరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు ఎంపీ జయదేవ్ డిమాండ్

న్యూఢిల్లీ, డిసెంబర్ 10: పన్నుల విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దేందుకు రాష్ట్ర విభజన చట్టాన్ని వెంటనే సవరించాలని తెలుగుదేశం సభ్యుడు గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. జయదేవ్ గురువారం లోక్‌సభలో 377 కింద ఇచ్చిన నోటీసుపై మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సమాన న్యాయం చేయాలంటే రెండు రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం ఒకే విధంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఒక రాష్ట్రానికి ఒక విధానం, రెండో రాష్ట్రానికి మరో విధానాన్ని అమలు చేయకూడదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని పన్నులకు సంబంధించిన సెక్షన్ 50, రుణాల వసూలుకు సంబంధించిన సెక్షన్ 51, పన్నుల తిరిగి చెల్లింపుకు సంబంధించిన సెక్షన్ 56 పరస్పర విరుద్దంగా ఉన్నాయని గల్లా సూచించారు. దీని మూలంగా ఆంధ్రప్రదేశ్‌కు సాలీనా 3,800 కోట్ల నష్టం వాటిల్లుతోందని ఆయన వెల్లడించారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు విభజన చట్టాన్ని సవరించాలంటూ ముఖ్యమంత్రి కేంద్ర హోం శాఖకు ఇది వరకే లేఖ రాశారని ఆయన తెలిపారు. ఆదాయాన్ని రెండు రాష్ట్రాలకు సమానంగా కేటాయించే విధంగా రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించాలని జయదేవ్ డిమాండ్ చేశారు.