అనంతపురం

15 లక్షల పట్టుగుడ్ల ఉత్పత్తికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* పట్టుపరిశ్రమ శాఖ జెడి అరుణకుమారి
మడకశిర, డిసెంబర్ 18 : జిల్లాలో 15 లక్షల బైవోల్టిన్ రకం పట్టుగుడ్ల ఉత్పత్తికి చర్యలు తీసుకుంటున్నట్లు పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ అరుణకుమారి, శాస్తవ్రేత్త సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం మడకశిరలో విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు 13 లక్షల బైవోల్టిన్ రకం పట్టుగుడ్లు ఉత్పత్తి అవుతుండగా 15 లక్షలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో మడకశిరలో 7.6 లక్షలు ఉత్పత్తి అవుతున్నట్లు తెలిపారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పట్టు సాగు విస్తీర్ణం తగ్గిపోతోందన్నారు. మడకశిర, హిందూపురం, పెనుకొండ, కుందుర్పి, రామగిరి, కొత్తచెరువు, కనగానపల్లి ప్రాంతాల్లో 30 ఎకరాల్లో పట్టు పంట సాగవుతున్నట్లు తెలిపారు. పట్టు సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు త్వరలోనే ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు చెప్పారు. పట్టు రైతులకు సబ్సిడీతో ఇచ్చే మందులను మరింత పెంచే విధంగా కమిషనర్‌తో చర్చించనున్నట్లు తెలిపారు. కాగా అనంతపురం, పెనుకొండ, హిందూపురం, మడకశిర, కళ్యాణదుర్గం డివిజన్‌ల నుండి ఒక్కొక్క రైతును ఎంపిక చేసి కాస్ట్‌షెడ్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. దీనికితోడు వేసవిలో పట్టుగూళ్ల ఉత్పత్తి కోసం అవసరమైన కూలింగ్ ట్యాంక్‌లను రూ.15 వేల సబ్సిడీతో అందజేయనున్నట్లు తెలిపారు. జిల్లాలో 27 వేల చేనేత కుటుంబాలకు నెలకు రూ.600 వంతున ఆర్థిక సహకారం అందిస్తుండగా గత జూన్ నుంచి నిధులు రాకపోవడంతో నిలుపుదల చేసినట్లు తెలిపారు. వచ్చిన వెంటనే అందజేస్తామన్నారు. అనంతరం స్థానిక రైతులు సాగు చేసిన బైవోల్టిన్ పట్టుగూళ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎడి శశాంక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చాకీ కేంద్రం ప్రారంభం
మండల పరిధిలోని గుండుమలలో బైవోల్టిన్ చాకీ కేంద్రాన్ని ప్రారంభించారు. పట్టు పురుగుల పెంపకంలో తగిన జాగ్రత్తలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ఇందులో భాగంగా చలి, వేసవి కాలాల్లో పట్టుగూళ్ల పెంపకంలో పాటించాల్సిన చర్యలపై పట్టు రైతులకు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శాస్తవ్రేత్త నరసింహమూర్తి, పట్టు రైతులు ఉన్నారు.