జాతీయ వార్తలు

జెఎన్‌యులో అత్యాచారాలు నిత్యకృత్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశ రాజధానిలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం అరాచకాలకు అడ్డాగా మారిందని, అక్కడ అత్యాచారాలు నిత్యకృత్యమని రాజస్థాన్‌కు చెందిన బిజెపి ఎమ్మెల్యే జ్ఞానదేవ్ అహుజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దిల్లీలో 50 శాతం అత్యాచారాలకు జెఎన్‌యు విద్యార్థులే కారణమని గతంలో ఆరోపించిన ఆయన ఇపుడు వర్సిటీలో సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు అదుపులేకుండా పోయిందంటున్నారు. జెఎన్‌యులో చాలామంది విద్యార్థులకు సెక్స్, డ్రగ్స్, ఇతర సంఘ వ్యతిరేక కార్యకలాపాలతో సంబంధాలున్నాయని, క్యాంపస్‌లో ప్రతిరోజూ వేల సంఖ్యలో కండోమ్‌లు, గర్భ నిరోధక మాత్రలు వాడుతుంటారని ఆరోపించారు. పగలు శాంతి ప్రదర్శనలు చేసేవారు రాత్రివేళ రాసలీలల్లో మునిగితేలుతుంటారన్నారు. కాగా, అహుజూ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, తన వ్యాఖ్యలను వెనక్కితీసుకునే ప్రసక్తే లేదని ఆ ఎమ్మెల్యే స్పష్టం చేశారు.