జాతీయ వార్తలు

రహస్య ప్రాంతంలో లొంగిపోతాం: జెఎన్‌యు విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశద్రోహం కేసులో నిందితులైన అయిదుగురు జెఎన్‌యు విద్యార్థులు తాము పోలీసులకు రహస్య ప్రాంతంలో లొంగిపోయేందుకు అనుమతించాలని దిల్లీ హైకోర్టును కోరారు. అయితే వీరి విజ్ఞప్తిని న్యాయస్థానం త్రోసిపుచ్చింది. అందరికీ తెలిసేలా విద్యార్థులు లొంగిపోతే ఆ క్షణంలో వారిపై దాడులు జరిగే అవకాశం ఉందని నిందితుల తరఫు లాయర్లు చేసిన వాదనను కోర్టు అంగీకరించలేదు. దేశద్రోహం కేసులో నిందితులైన వారిని అరెస్టు చేయరాదంటూ తాము ఆదేశాలు ఇవ్వలేమని, విద్యార్థుల పిటిషన్‌పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.