జాతీయ వార్తలు

మహిళా జర్నలిస్ట్‌కు తమిళనాడు గవర్నర్‌ క్షమాపణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: మహిళా విలేకరి పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించినందుకు తమిళనాడు గవర్నర్‌ బన్వారీలాల్‌ పురోహిత్‌ క్షమాపణలు కోరారు. నిన్న సాయంత్రం విలేకరుల సమావేశంలో బన్వారీలాల్‌ ఓ మహిళా జర్నలిస్ట్‌ చెంపపై తాకి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై బన్వారీలాల్‌ స్పందించారు. ‘మీరు మంచి ప్రశ్న అడిగారు, అందుకే ప్రశంసాపూర్వకంగా చెంపపై తాకాను. నిన్ను నా మనవరాలిగా అనుకున్నాను. విలేకరిగా మంచి ప్రతిభ చూపించినందుకు ప్రశంసించేందుకే అలా చేశాను. నేను కూడా 40ఏళ్ల పాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నాను’ అని బన్వారీలాల్‌ పేర్కొన్నారు. గవర్నర్‌ క్షమాపణలను తాను అంగీకరిస్తున్నానని విలేకరి లక్ష్మి సుబ్రమణియన్‌ వెల్లడించారు.