జాతీయ వార్తలు

జాట్‌ల ఆందోళన హింసాత్మకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోహ్టక్, ఫిబ్రవరి 19: హర్యానాలో జాట్ల రిజర్వేషన్ ఉద్యమం శుక్రవారం ఉగ్రరూపం దాల్చింది. రాష్ట్రంలోని అనేక చోట్ల, హింస, విధ్వంసకాండ చెలరేగడంతో సైనిక దళాలను రంగంలోకి దింపారు, వివిధ సంఘటనల్లో ముగ్గురు మరణించిన నేపథ్యంలో కనిపిస్తే కాల్చివేత ఆదేశాలు జారీ చేశారు. మరో పక్క ఆందోళనకారులు రాష్ట్ర హోం మంత్రి ఇంటినే దగ్ధం చేయడంతో అనేక చోట్ల కర్ఫ్యూ విధించారు. మొత్తం తొమ్మిది జిల్లాల్లో శాంతిభద్రతలు అదుపు తప్పడంతో ఆ బాధ్యతను సైన్యానికి అప్పగించారు. ఆందోళనకారులపై పోలీసు చర్యలో ముగ్గురు చనిపోగా, మరో 25 మంది గాయపడ్డారు. రెచ్చిపోయిన ఆందోళనకారులు పలు చోట్ల విధ్వంసకాండకు పాల్పడ్డంతో రెండు జిల్లాల్లో పూర్తిస్థాయి కర్ఫ్యూ విధించారు. రోహ్టక్, జజ్జార్, హన్సీ సహా పలు చోట్ల ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను లక్ష్యంగా చేసుకుని విధ్వంసకాండకు దిగడమే కాకుండా కొంతమంది పోలీసులను బందీలుగా కూడా పట్టుకున్నారు. ఢిల్లీ-హిస్సార్, ఫాజిల్కా హైవేపై హిస్సార్ జిల్లాలోని హన్సీ, రోహ్టక్ సమీపంలో రెండు టోల్ ప్లాజాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.
రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ హర్యానాలో జాట్‌లు గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. జాట్‌లకు రిజర్వేషన్లు కల్పించడానికి ఒక పరిష్కారాన్ని రూపొదించడం జరుగుతుందని, అందువల్ల ఆందోళనను విరమించాలని శుక్రవారం ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశం ఆందోళన చేస్తున్న జాట్‌లకు విజ్ఞప్తి చేసింది. అయితే ఆ విజ్ఞప్తిని ఆందోళనకారులు తిరస్కరించారు. అఖిల పక్ష సమావేశం విజ్ఞప్తి తర్వాత ఆందోళన ఒక్కసారిగా హింసాత్మకంగా మారిపోయింది. రోహ్టక్‌లో విధ్వంసకాండకు పాల్పడుతున్న ఆందోళనకారుల్లో ఒకరు బిఎస్‌ఎఫ్ జవానుపై కాల్పులు జరిపి గాయపర్చడంతో ఆత్మరక్షణ కోసం బిఎస్‌ఎఫ్ జవాన్లు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి చెందాడని హర్యానా పోలీసు డైరెక్టర్ జనరల్ యశ్‌పాల్ సింఘాల్ చండీగఢ్‌లో చెప్పారు. పరిస్థితి చేయి దాటి పోతున్నందున ఆందోళన ప్రభావం తీవ్రంగా ఉన్న రోహ్టక్, జజ్జార్, జింద్, భివానీ, హిస్సార్, కైతాల్, పానిపట్, సోనిపట్ జిల్లాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు సైన్యాన్ని పిలిపిస్తున్నట్లు డిజిపి చెప్పారు.
జాట్‌ల ఆందోళన ప్రారంభమైన తర్వాత మొట్టమొదటిసారి శుక్రవారం నాడు ఢిల్లీ-అంమాలా జాతీయ రహదారిపైన, ప్రధాన రైలు మార్గంపైన అనేక చోట్ల రైలు, రోడ్డు ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. జాట్‌లు రైలు పట్టాలపై బైఠాయించడంతో చాలాచోట్ల రైళ్లు నిలిచిపోయాయి. ఆందోళన దృష్ట్యా దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లతో పాటు పలు రైళ్లను రద్దు చేశారు.