మెదక్

క్రీడల్లో తారతమ్యాలు ఉండవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, జనవరి 21: మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి కోరిక మేరకు గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని మెదక్ సబ్ కోర్టు, అదనపు జిల్లా కోర్టు, మెబైల్ కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో క్రికెట్ క్రీడలను నిర్వహించేందుకు నిర్ణయంచినట్టు అదనపు జిల్లా జడ్జి ఎన్.రాజకుమార్ తెలిపారు. గురువారం మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో క్రికెట్ ప్రారంభోత్సవానికి ముందు ఆయన విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక గణతంత్ర దినోత్సవానికి ముందే మూడు రోజుల పాటు క్రికెట్ క్రీడలను నిర్వహించాలని బార్ అసోసియోషన్ తీర్మానించిందని ఆయన తెలిపారు ఎడిజె రాజ్‌కుమార్ తెలిపారు. క్రీడలు ప్రతి ఒక్కరికి అవసరమన్నారు. క్రీడలు కోర్టులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి మంచి అనుభూతిని, మంచి స్నేహ సంబంధాలను కలిగిస్తాయన్నారు. వాస్తవానికి ఇలాంటి సంబరాలు రావడం తమకెంతో ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. ఈ క్రీడలను నిర్వహిస్తున్న మెదక్ బార్ అసోసియోషన్ అధ్యక్షులు జనార్దన్‌రెడ్డిని ఎడిజె రాజకుమార్ అభినందించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని మూడు రోజుల పాటు పండుగలు జరుపుకోడానికి అనుమతించిన ఎడిజె రాజకుమార్, సబ్ జడ్జి పివిపి లలిత శివజ్యోతి, జూనియర్ సివిల్ జడ్జి డి.వెంకటేశ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. నాలుగు టీములుగా విభజించి క్రికెట్ క్రీడలను నిర్వహిస్తున్నట్టు జనార్దన్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జె.శ్రీపతిరావు, ప్రధాన కార్యదర్శి జి.లక్ష్మణ్‌కుమార్, క్రీడల కార్యదర్శి ఆర్.సిద్ద్ధిరాములు, గ్రంథాలయ కార్యదర్శి జి.సతీష్‌రెడ్డి, ట్రెజరర్ వికె.శ్రీవాస్తవ్, న్యాయవాదులు సి.పోచయ్య, కె.వినోద్‌కుమార్, మాయ వెంకటేశం, ఫజల్ అహ్మాద్, ఎం.రాములు, కె.శ్రీనివాస్, జనార్దన్‌రెడ్డి, ఎం.బాలయ్య, జి.సురేష్‌కుమార్, ఎస్.సిద్దాగౌడ్, రజీమున్సిసాబేగం, ఎస్.కృష్ణారెడ్డి, శోభన్‌గౌడ్, ఎజిపి డి.రామేశ్వరం, ఎ.రవీందర్ తదితరులు పాల్గొన్నారు.