జాతీయ వార్తలు

కాశ్మీర్ రాజకీయ సంక్షోభం త్వరలో కొలిక్కి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, జనవరి 24: జమ్మూ, కాశ్మీర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై పిడిపిలో నెలకొన్న సంక్షోభం త్వరలోనే ఒక కొలిక్క వచ్చేట్లు కనిపిస్తోంది. అధికార పగ్గాలు తమ కుటుంబానికి చెందినవారి చేతుల్లోనే ఉండాలని పిడిపి అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ భావిస్తూ ఉండడమే ప్రభుత్వం ఏర్పాటులో జాప్యానికి అసలు కారణమని భావిస్తున్నారు. బిజెపితో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వం పది నెలల సమయంలో కూటమి అజెండాను అమలును తాము సమీక్షిస్తున్నామని పిడిపి ఓ వైపు అంటుండగా, ఈ నెల 7న తన తండ్రి ముఫ్తీ మహమ్మద్ సరుూద్ మృతి తర్వాత ఆయన ఏకైక కుమారుడు, తన సోదరుడు తస్సదుక్ హుస్సేన్‌ను రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకురావడంపైనే మెహబూబా గత వారమంతా దృష్టి కేంద్రీకరించారు. ‘ఓంకారా’ సినిమా ఫేమ్, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అయిన 44 ఏళ్ల తస్సదుక్ హుస్సేన్ పార్టీ నిర్వహణ భారాన్ని కొంతయినా మోయాలని మెహబూబా భావిస్తున్నారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్ జీవించి ఉన్నప్పుడు అసలు రాజకీయాల్లోకి రావడానికే ఇష్టపడని హుస్సేన్ గత ఆదివారం జరిగిన పిడిపి కోర్ కమిటీ సమావేశంలో చడీచప్పుడు లేకుండా ప్రత్యక్షమయ్యారు.
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని మెహబూబాకు అప్పగిస్తూ ఈ సమావేశంలో ఒక తీర్మానం చేసింది. ముఫ్తీ బతికి ఉన్నప్పుడు హుస్సేన్ రాజకీయాల్లోకి రావడానికి ఇష్టపడేవాడు కాదని, అయితే ఆ తర్వాత ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి రావడానికి కొంత ఆసక్తి కనబరుస్తున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని పిడిపి సీనియర్ నాయకుడొకరు చెప్పారు.
రాష్ట్రంలో అమలవుతున్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద పార్టీ అధ్యక్షుడికి తిరుగులేని అధికారాలున్న దృష్ట్యా పార్టీ అధ్యక్ష పదవిని తమ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారికే అప్పగించాలని మెహబూబా అనుకుంటున్నారని, హుస్సేన్ అందుకు సరయిన వ్యక్తని భావిస్తున్నారని పార్టీ వర్గాలు అనుకుంటున్నారు. తస్సదుక్ హుస్సేన్ రాజకీయ అరంగేట్రం గురించి అధికారికంగా పిడిపి ఎలాంటి ప్రకటనా చేయనప్పటికీ ఇప్పుడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఆయన కనీసం పార్టీలో కొంతమేర చురుకైన పాత్ర పోషించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.