జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో పోలీసు కాల్పులు: ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఫిబ్రవరి 14: కాశ్మీర్‌లో తమపైకి రాళ్లు రువ్వుతున్న ఒక గుంపుపై భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో ఒక బాలిక కూడా ఉంది. అంతకుముందు దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక గుర్తు తెలియని మిలిటెంట్ మృతి చెందాడు. ఈ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా కకపొర ప్రాంతంలోని లిల్‌హార్‌లో కొంతమంది ప్రజలు ప్రదర్శన తీశారు. ఈ సందర్భంగా ఒక గుంపు భద్రతా బలగాలపై రాళ్లు రువ్విందని, దీంతో భద్రతా బలగాలు కాల్పులు జరిపారని పోలీసులు వివరించారు. ఈ కాల్పుల్లో దనీశ్, షహిష్ట అనే ఇద్దరు మృతి చెందారని తెలిపారు.