AADIVAVRAM - Others

కొలువు ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చమత్కారంగా సంభాషించడం ఓ కళ నాటికీ నేటికీ.
నాడు రాజుల వద్ద కొలువు సంపాదించేందుకు ఇలాంటి ప్రజ్ఞాపాటవాలే ప్రదర్శించేవారు. తెనాలి రామకృష్ణులు కూడా రాయలవారి కొలువులో ప్రాపకం సంపాదించినదీ ఇలానే...
అలాంటి ఉదంతమే ఇదీ..
రాజుగారిని నేరుగా కలవడం నాడు దుర్లభమే. అటుగా వస్తున్న విప్రుడిని నిలువరిస్తున్న భటుల కర్కశ సంభాషణా శైలి గమనించి - రాజుగారు కనుసైగలతోనే వారిని నిలువరించి, ఆ విప్రుడిని ప్రవేశపెట్టమని ఆదేశించారు.
‘మహారాజా! అభివాదము. పేదవాడను. విప్రుడను. అబద్ధము నేర్వను. నా గురించి ఎక్కువగా చెప్పుకొనజాలను. కాలానుగుణంగా వస్తున్న మార్పులకు ఎదురొడ్డలేక, ఆదరణ లేక, సరైన సంపాదనాశూన్యుడనైనాను. గనుక మీరే నాయందు దయ వుంచి ఏదైనా పని ఇప్పించండి ప్రభూ...!’ అని వేడుకొన్నాడు.
కరకు చూపులే విసిరినా, రాజుగారు హృదయాన్ని తెరచి విన్నారు. ‘ఊ! అయితే నీవేమి చేయగలవు?’ ప్రశ్నించారు.
‘అయ్యా! నేను ‘చతురంగతజ్ఞుడను’ అన్నాడు వినమ్రంగా వంగి చేతులు జోడిస్తూ.
రాజుగారు సందేహంలో పడ్డారు. సహజకవియైన మాకే తెలియని కొత్త సమాసమా.. అనుకొంటూ - తికమకగా మంత్రివర్యుల వైపు చూపు తిప్పారు. మంత్రిగారు, ‘విప్రుడను, పేదవాడను అంటూనే రాజుగారితో పరిహాసమా! నీవు ఏమి చెప్పదలచావో సూటిగా చెప్పు’ అని గద్దించారు.
‘మంత్రివర్యా! నేను రాజుగారికి క్లుప్తంగా సూటిగానే చెప్పానే. నేను చతురంగతజ్ఞడను... అనగా రాజుగారికి ఆటవిడుపు సమయంలో చదరంగం క్రీడలో విశ్రాంతి చేకూర్చగలను. రాజుగారు యుద్ధానికి వెళ్లవలసిన వేళ తురంగతజ్ఞుడను కాగలను.
కళలను మీరు ఆదరించే సమయానికి రంగతజ్ఞడను (నాట్య శాస్త్ర ప్రావీణ్యం కలవాడు) కాగలను. ఇక మీకు గతజ్ఞుడను (ఖగోళశాస్త్ర ప్రావీణ్యుడను) కాగలను. సమస్యల పరిష్కరణా సందిగ్ధత తలెత్తినపుడు తర్కశాస్త్రం తెలిసిన వాడనగుటచే, తజ్ఞడను. ఇన్ని ప్రక్రియలలో జ్ఞానం కలిగినవాడను గనుక జ్ఞడను (తెలివి కలవాడను) కాకపోను కదా. ప్రభువులకు నా గురించి నేను ఇన్నిట ప్రవేశమున్నదని నేరుగా చెప్పుట పాడికాదని, చతురంగతజ్ఞుడను అని మాత్రమే విన్నవించుకొన్నాను మంత్రివర్యా..’ అన్నాడు పునః నమస్కారం చేస్తూ.
‘ఓహో! నీకు భాషా ప్రావీణ్యం కూడా ఉన్నదే’ అని రాజుగారు మెచ్చుకొంటూ భూదాన, గోదానాలతోపాటు వేయి వరహాల మూట కూడా అందించి.. మంత్రివర్యుల సరసన కొలువులో విప్రుని ప్రజ్ఞకి తగిన స్థానం కల్పించారు.