జాతీయ వార్తలు

సీఎం కుమారస్వామి రాజీనామాకు గవర్నర్ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: విశ్వాస పరీక్షలో సంకీర్ణ సర్కార్ కూటమి ఓటమి పాలవ్వటంతో సీఎం కుమారస్వామి రాజీనామా చేశారు. ఈమేరకు కుమారస్వామి గవర్నర్‌కు రాజీనామా లేఖను అందజేశారు. రాజీనామాను స్వీకరించిన గవర్నర్ వాజ్‌భాయ్ వాలా వెంటనే ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆయన కోరారు. ఈ సమయంలో ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని సూచించారు. విశ్వాస తీర్మానంపై నిన్న జరిగిన ఓటింగ్‌లో కనీస మెజార్టీకి అవసరమైన సభ్యుల మద్దతును కుమార సర్కార్‌ సంపాదించలేకపోయింది. ఈ పరిస్థితుల్లో దాదాపు 14 నెలల కాంగ్రెస్‌ - జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం పతనమైంది. 99- 105 ఓట్ల తేడాతో ప్రభుత్వం పడిపోయింది.