జాతీయ వార్తలు

కర్నాటకలో ఆగని ఆందోళనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేయాలని సుప్రీం కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కర్నాటకలోని మాండ్యా ప్రాంతంలో ఇంకా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైతులు కావేరీ నదిలో నిలబడి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలను అడ్డుకునేందుకు పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. కృష్ణరాజసాగర్, బృందావన్ గార్డెన్, ఇతర జలాశయాల వద్ద నిషేధాజ్ఞలు విధించారు. మాండ్యాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రెండు జలాశయాల నుంచి 15వేల క్యూసెక్కుల కావేరీ జలాలను మంగళవారం అర్ధరాత్రి తమిళనాడుకు విడుదల చేశారు. కర్నాటక సిఎం సిద్ధరామయ్య అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి సుప్రీం ఆదేశాలను అమలు చేస్తున్నట్టు ప్రకటించారు.