జాతీయ వార్తలు

స్టాలిన్‌కు వెనుకసీటుపై కరుణ ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: జయలలిత ప్రమాణ స్వీకారోత్సవంలో తన కుమారుడు స్టాలిన్‌కు అవమానం జరిగిందని డిఎంకె అధినేత కరుణానిధి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జయ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్టాలిన్‌కు వెనుకవరసలో సీటు కేటాయించారని, ఎన్నికల్లో ఓడిపోయిన నటుడు శరత్‌కుమర్‌కు ముందు వరసలో కూర్చోబెట్టారని ఆయన సోమవారం విలేఖరులతో అన్నారు. 89 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న స్టాలిన్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు. ‘ప్రత్యర్థులను అవమానపరిచే జయలలిత వైఖరిలో నేటికీ మార్పు లేదు, ఇకముందు కూడా రాదు..’ అని కరుణానిధి వ్యాఖ్యనించారు.