జాతీయ వార్తలు

కావేరీ జలాలపై కర్ణాటకకు స్వల్ప ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పదిరోజుల పాటు రోజుకు 15,000 క్యూసెక్కుల కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయాలంటూ ఇటీవల ఇచ్చిన ఉత్తర్వును సుప్రీంకోర్టు సోమవారం సవరించింది. ఈనెల 20 వరకూ రోజుకు 12,000 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని తాజాగా ఆదేశాలిచ్చింది. గత వారంలో ఇచ్చిన తీర్పులో పేర్కొన్న దాని కంటే 3 వేల క్యూసెక్యుల పరిమాణం తక్కువ కావడం కర్ణాటకకు స్వల్ప ఊరటనిచ్చింది. తమ ఉత్తర్వులకు శాంతిభద్రతల పరిస్థితితో ముడిపెట్టడం కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.