కడప

చంద్రబాబుతోనే రాష్ట్భ్రావృద్ధి : విప్ మేడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుండుపల్లె, జూలై 7: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతోనే రాష్ట్భ్రావృద్ధి జరుగుతుందని విప్ మేడా మల్లిఖార్జునరెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని శివాలయంలో ఏర్పాటు చేసిన నవనిర్మాణదీక్షలో ఏడీ రాధాదేవి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మేడా మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయి రూ.16 వేల కోట్లు లోటుబడ్జెట్ ఉన్నప్పటికీ రాష్ట్భ్రావృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, అలాగే పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి రాయలసీమకు కృష్ణా జలాల నుంచి నీరు వచ్చేందుకు సీఎం చంద్రబాబు విశేషకృషి చేస్తున్నారన్నారు. రైతులకు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో కష్ట, నష్టాలు, ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ రైతులు సేంద్రీయ పద్ధతిలో సేద్యం చేస్తే అధిక దిగుబడులు వస్తాయని, వారికి తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు.
రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని ఆయన తెలిపారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్యప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వారిని ప్రోత్సహించి వారికి తగిన ప్రోత్సాహక బహుమతులు నగదును అందజేశారు. అనంతరం చప్పిడివాండ్లపల్లెలో టీడీపీ నాయకుడు చప్పిడి మహేష్‌నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం క్రిష్ణారెడ్డిచెరువులో నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా పూజలు నిర్వహించి చెరువులో పూడికతీత పనులు ప్రారంభించారు. సీఎం చంద్రబాబు రాష్ట్భ్రావృద్ధి కోసం నీరు-చెట్టు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, దీనివలన రైతులకు, ప్రజలకు నీటి సమస్య రాకుండా దోహదపడుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సుబ్రమణ్యంరెడ్డి, ఎంపీడీవో రామచంద్రారెడ్డి, ఎంఈవో వెంకటేశునాయక్, టీడీపీ నాయకులు యర్రపురెడ్డి శివరామిరెడ్డి, చప్పిడి మహేష్‌నాయుడు, మహేశ్వర్‌రాజు, శివారెడ్డి, విశ్వనాథనాయక్, అంగన్‌వాడీ కార్యకర్తలతో పాటు మండల ప్రజలు పాల్గొన్నారు.