కడప

పురాతన ఆలయాల అభివృద్ధికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందలూరు, జూన్ 7:రాష్ట్రంలో ఎన్నో శతాబ్దాల కాలం నాటి మరుగుగన పడిన ఆలయాల అభివృద్ధికి సిఎం ఆదేశాల మేరకు కృషి చేస్తున్నట్లు దేవాదాయ శాఖ పర్యాటక డైరెక్టర్ రత్నకుమార్ తెలిపారు. మంగళవారం శ్రీ సౌమ్యనాథ ఆలయాన్ని పర్యాటక డైరెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఇఓ సుబ్బారెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో పురాతనమైన, శిల్పకళ సంపద కలిగిన ఆలయాలెన్నో మరుగున పడ్డాయన్నారు. ప్రత్యేకంగా మన రాష్ట్రం పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు సిఎం చంద్రబాబునాయుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారన్నారు. దేవాదాయ శాఖలో రిలీజియం, టూరిజం శాఖను కొత్తగా ప్రవేశ పెట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ జెఎస్వీ ప్రసాద్ నేతృత్వంలో ఇతర రాష్ట్రాల నుండి తిరుపతికి వచ్చే యాత్రికులు కర్నూల్ వరకు ఆలయాలను దర్శించేలా టూరిజయం ఫ్యాకేజి రూపొందించడం జరిగిందన్నారు. కడప, కర్నూల్, అనంతపురం జిల్లాలలో విజయనగరం రాజుల కాలం నాటి ఆలయాలు ఎన్నో ఉన్నాయన్నారు. గడికోట, అత్తిరాల, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట అన్నమయ్య జన్మస్థలం తాళ్లపాక, కడప పెద్ద దర్గా తదితర ఆలయాలను పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పర్యాటకంగా ఈ ప్రాంతాలకు విశేష ప్రచారం కల్పించడం జరుగుతుందన్నారు. శ్రీశైలం, దాక్షారామం, శ్రీకాళహస్తి త్రిలింగ యాత్ర సర్క్యూట్ అభివృద్ధి పరచడం జరుగుతుందన్నారు. చరిత్రకు సంబంధించిన అనేక ఆలయాలు నేడు నిరాదరణకు గురయ్యాయని, ఇప్పటి వరకు 40 పురాతన ఆలయాలను గుర్తించి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇఓ సుబ్బారెడ్డి, ఆలయ నిర్వాహకులు పల్లె సుబ్రమణ్యం పాల్గొన్నారు.