కడప

దళిత గిరిజనుల సంక్షేమానికి కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూన్ 7: దళిత గిరిజన సంక్షేమం కోసం శాయశక్తుల పాటుపడతానిన ఏపి ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక జెడ్పి సమావేశ మందిరంలో దళిత గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో చైర్మన్ శివాజికి సన్మాన సభ జరిగింది. ఈసభకు హాజరైన శివాజి మాట్లాడుతూ నవ్యాంధ్రలో తనను ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కులవిక్షతను రూపుమాపేందుకు అంబేద్కర్ పోరాటం చేసి మనకోసం ఎన్నో హక్కులు కల్పించి రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు. అంబేద్కర్ సిద్ధాంతాలు ఆచరించే విధంగా మనం కృషి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని సమస్యలేమైనా ఉంటే అవగాహన పెంచుకుని మాట్లాడాలన్నారు. కులవ్యవస్థను కూకటి వేళ్లతో పెకిలించేందుకు రాజీలేని పోరాటం చేస్తామని, దళిత గిరిజన గుండెల్లో వెలుగులు నింపేందుకు తన వంతు కృషి చేస్తామన్నారు. అనంతరం జెడ్పి చైర్మన్ గూడూరు రవి మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా కారెం శివాజి జిల్లాకు రావడం సంతోషంగా ఉందని, అందరూ ఐక్యమత్యంతో అన్నదమ్ముల వలే మెలిగి జాతి ఉన్నతికోసం పాటుపడాలన్నారు. సంఘటితంగా ఉండి ధైర్యంగా ఎదిరించగలిగేసత్తా వుంటే హక్కులను కాపాడుకోగలుగుతామన్నారు. మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు శరత్‌బాబు మాట్లాడుతూ కారెం శివాజిని ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమించడం సంతోషంగా ఉందన్నారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు సద్వినియోగం చేసుకుని లబ్ధిపొందాలన్నారు. బద్వేలు టిడిపి ఇన్‌చార్జ్ విజయజ్యోతి మాట్లాడుతూ యుక్తవయస్సు నుంచి జాతికోసం శివాజి పాటుపడుతున్నారని, దళిత జాతికి చెందిన మనిషిని అని పేదల అభివృద్ధికోసంపాటుపడతానన్నారు.
మహిళ పారిశ్రామికవేత్త రత్నమ్మ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయసాధనకోసం ముందుకువెళ్లాలన్నారు. అభివృద్ధికి మూలమైనవి పరిశ్రమలే అని పారిశ్రామిక రంగంలో ముందుకువెళ్లేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు మనోహర్‌తోపాటు నాయకులు పాల్గొన్నారు. అనంతరం దళిత గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజిని సన్మానించారు.