కడప

టార్గెట్ జగన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 7: ప్రతిపక్ష నేత విమర్శలకు ఆయన సొంతగడ్డ నుంచే సమాధానమిచ్చేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే నవనిర్మాణ దీక్షల ముగింపు కార్యక్రమాన్ని బుధవారం కడప నగరంలో ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ బహిరంగసభలో ముఖ్యమంత్రితోపాటు ఆయన తనయుడు లోకేష్, కేంద్ర,రాష్ట్ర ముఖ్య నాయకులు, మంత్రులు పాల్గొననున్నారు. జగన్‌ను టార్గెట్ చేసేందుకే సిఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి నవనిర్మాణ దీక్షల మహాసంకల్ప సభ ఒంగోలులో జరగాల్సి ఉంది. అయితే ఈమధ్యలో వైకాపా అధినేత జగన్మోహన్‌రెడ్డి అనంతపురం జిల్లాలో జరిగిన రైతు భరోసాయాత్రలో సిఎంను టార్గెట్ చేస్తూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. దీనిపై ముఖ్యమంత్రి తన సన్నిహితుల వద్ద ప్రస్తావించి వౌనం వీడాలని సూచించినట్లు సమాచారం. దీంతో పలువురు మంత్రులు జగన్ వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రత్యారోపణలను గుప్పించారు. ఇదిలా ఉండగా కడప జిల్లాపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే బుధ, గురువారం రెండు రోజుల పాటు కడపలో మకాం వేసి పలువురు పార్టీ ముఖ్యులతో సమావేశం కానున్నట్లు తెలిసింది. జిల్లాలో జగన్ ప్రాబల్యం తగ్గించడమేగాక, టిడిపి బలం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు పలు సూచనలు, సలహాలు అందజేయనున్నట్లు సమాచారం. అంతేగాక టిడిపిలోకి వలసలపై ప్రత్యేక దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్‌ను కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు, జిల్లా ప్రగతి గురించి ప్రజలకు వివరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కడప జిల్లాపై ప్రత్యేక దృష్టిసారించి జగన్ ఆధిపత్యానికి అడ్డుకట్టవేసేందుకు స్వయంగా సిఎం రంగంలోకి దిగినట్లు దీన్నిబట్టి స్పష్టమవుతోంది.