కడప

12న తల్లిదండ్రుల పాదపూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజంపేట టౌన్, జూన్ 9:స్థానిక శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 12న ఉదయం 9 గంటల నుండి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కుల, మతాలకు అతీతంగా తల్లిదండ్రుల పాద పూజా మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు టివి రమణారెడ్డి, అబ్దుల్లా, సి.చెంగయ్య తెలిపారు. తరాలు మారే కొద్ది తల్లిదండ్రులు-సంతానానికి మధ్య ఉండాల్సిన ఆత్మీయతా-అనురాగాలు తరిగి పోతున్న కారణంగా కుటుంబాలలో సుఖ సంతోషాలు దూరమై అశాంతి నిలయాలుగా తయారవుతున్న దృష్ట్యా ధార్మిక, నైతిక విలువలతో కూడి శాస్త్రోక్తంగా ఈ పాద పూజా మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. కుటుంబం కోసం తల్లిదండ్రులు చేసిన త్యాగాలు, సేవలను తమ సంతానం మరవరాదనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. కుల, మతాలకు అతీతంగా శాస్త్రోక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో ఎవరైననూ తమ తల్లిదండ్రులతో పూజా ద్రవ్యాలు, పూలమాలలతో పాల్గొన వచ్చునని వారు తెలిపారు.