కడప

సమర్థవంతంగా పనిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, జూన్ 9:జిల్లా అధికార యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తూ ఉన్న వనరులతో ప్రజలకు దోహదపడే విధంగా ప్రజల్లో చైతన్యం తెచ్చి అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం ఉదయం నగరంలోని ఆర్‌అండ్‌బి గెస్ట్‌హౌస్‌లో ఆధికారుల సమీక్షా సమావేశంలో అధికారులకు సుదీర్ఘంగా హితబోధ చేశారు. ఆ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాష్టవ్య్రాప్తంగా ఏ ప్రాంతంలో ఎంతవర్షపాతం నమోదు అవుతుందో ఆన్‌లైన్ ద్వారా తెలుసుకుంటున్నామని అధికారులు కూడా సాంకేతిక పరంగా ముందుకు పోవాలన్నారు. భూగర్భజలాల నీటి మట్టం ఎంతపెరిగింది, రిజర్వాయర్లలో ఎంత నీరు చేరిందో తదితర వివరాలు తెలుసుకోవచ్చునన్నారు. గురువారం ఉదయం వర్షపాతం చూస్తే జాంఢ్రపల్లి, కలసపాడు తదితర ప్రాంతాల్లో 32 మి.మీ.నుంచి 40.6 మి.మీ.వరకు ఉందన్నారు. ఎన్‌టిఆర్ భరోసా కింద రాష్ట్రంలో 94.58శాతం పెన్షన్లు పంపిణీ చేస్తున్నారన్న సమాచారాన్ని కూడా ఆన్‌లైన్ ద్వారా తెలుస్తోందన్నారు. జిల్లాలో ఈ ఏడాది కూడా వర్షాలు బాగా ఉందన్నారు. నీటి ఎద్దడి సమస్య రాకుండా చూసుకోవాలన్నారు. ప్రతి వర్షపు బొట్టును ఒడిసిపట్టుకుని భూగర్భజలాల్లోకి ఇంకింపచేయాలన్నారు. మీటరు భూగర్భజలం పెరిగితే 90 టిఎంసిల నీరు పెరిగినట్లు అవుతుందన్నారు. రాబోయే రోజుల్లో అన్ని ప్రాంతాల్లో ఆస్తులకు జియోటాగ్‌ను చేయిస్తామని ప్రతి శాఖలో నలుగురు కాంట్రాక్టు సిబ్బందిని తీసుకుంటామని , వారి ద్వారా సాఫ్ట్‌మేనేజ్‌మెంట్, డివైసెస్, సాప్ట్‌వేర్ ట్రైనింగ్, ఇన్‌ఫోవేటివ్ టెక్నాలజిని కిందిస్థాయి వరకు తీసుకెళ్తామన్నారు. ఆదాయం ఎక్కువ వచ్చేలాగా టెక్నాలజిని వాడుకుంటున్నామని, కన్వర్జెన్సీల వల్ల ఉత్తమ ఫలితాలు సాధించగలమన్నారు. గత ఏడాది కన్వర్జెన్సీ చేయనందువల్ల రూ.4,500కోట్లు ప్రభుత్వానికి సరెండర్ చేశామన్నారు. ఈ ఏడాది కనె్వర్జన్సీ చేయడం వల్ల 60శాతం లేబర్ కాంపౌండెంట్ , 40శాతం మెటీరియల్ కాంపౌండెంట్‌ను రెండింటిని సమన్వయపరచి అభివృద్దిలోకి తీసుకురావాలన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక టీమ్‌ను ఏర్పాటుచేసి ఆ టీమ్ ద్వారా అన్నిశాఖల పనితీరును అధ్యయనం చేస్తామన్నారు. అందరి సహకారంతో జిల్లాలో అత్యుత్తమ ఫలితాలు తీసుకురావాలన్నారు. ఈకార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ కెవి సత్యనారాయణ, జెసి శే్వత తదితరులు పాల్గొన్నారు.