కడప

పెండింగ్ కేసులు పరిష్కరించండి : ఎఎస్పీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పులివెందుల, జూన్ 10: డివిజన్ పరిధిలోని పెండింగ్ కేసులన్నింటినీ పరిష్కరించాలని, క్రైమ్ రేటును కూడా తగ్గించాలని పులివెందుల ఎఎస్పీ అన్బురాజన్ అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో రీజనల్ పోలీసు అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇంతవరకు పెండింగ్‌లో ఉన్న ప్రతి కేసును పరిష్కరించాలన్నారు. అలాగే ఎక్కడా కూడా క్రైమ్ రేటు పెరగకుండా చూడాలన్నారు. అసాంఘీక కార్యకలాపాలు, శాంతిభద్రతలపై ప్రత్యేక దృష్టి నిలిపి ప్రతి గ్రామంలోను ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రతి గ్రామానికీ పోలీసులు రోజూ వెళ్లి అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ వుండాలన్నారు. కార్యక్రమంలో పులివెందుల, లక్కిరెడ్డిపల్లె, రాయచోటి సిఐలు, డివిజన్ పరిధిలోని ఎస్‌ఐలు పాల్గొన్నారు.