జాతీయ వార్తలు

కేరళలో భారీ వర్షాలకు 12మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు రూ.8కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు రెవిన్యూ శాఖ మంత్రి చంద్రశేఖరన్ వెల్లడించారు. మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి పినరయి విజయన్ కలెక్టర్లను ఆదేశించారు. రాష్టవ్య్రాప్తంగా ప్రత్యేక శిభిరాలను ఏర్పాటుచేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కేరళలో ఇప్పటికే సాధారణ వర్షపాతం కంటే అదనంగా 25శాతం వర్షపాతం అధికంగా నమోదు అయింది. కొచ్చిలో ఏకంగా 231 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.