జాతీయ వార్తలు

కేరళలో భారీవర్షాల బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళ: కేరళ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. బుధవారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 24 ఆనకట్టల గేట్లు ఎత్తివేయటంతో దిగువ ప్రాంతాలను వరద నీరు ముంచెత్తుతుంది. రాష్ట్రంలోని ఇడుక్కి, కోజికోడ్, వయనాడ్, మలప్పరం జిల్లాల్లో సైన్యం, జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్) రంగంలోకి సహాయక చర్యలు చేపట్టారు. ఈ భారీ వర్షాలకు ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 26మంది చనిపోయారు. చెరుతోని ఆనకట్ట గేట్లు సైతం ఎత్తివేశారు. 26 ఏళ్ల తరువాత ఈ ఆనకట్ట గేట్లు ఎత్తివేయటం ఇదే తొలిసారి. కాగా కేరళను కుదిపేస్తున్న ప్రకృతి విపత్తుపై ప్రధాని మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఫోన్‌లో మాట్లాడారు.