జాతీయ వార్తలు

కేరళను వీడని వరద బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: కేరళను వరద బీభత్సం ఇంత వరకు వీడలేదు. కొచ్చి విమానాశ్రయంలోకి వరద నీరు రావటంతో శనివారం వరకు విమానాల రాకపోకలను నిషేధించారు. అనేక ఆనకట్టల గేట్లు తెరవటంతో పల్లపు ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అలాగే పాలక్కడ్ జిల్లాలో కొండ చరియలు విరిగిపడి ఏడుగురు చనిపోయారు. ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 87కి చేరింది. రాష్ట్రంలోని 14 జిల్లాల్లో అత్యంత ప్రమాదకర స్థాయి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు 1.4 లక్షల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. మెట్రోరైలు సర్వీసులను సైతం నిలిపివేశారు.