జాతీయ వార్తలు

భారీ వర్షాల ముప్పు..అంతా అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు భారీ వర్షాల ముప్పు పొంచి ఉంది. తమిళనాడు, పుదుచ్చేరిలలో ఎడతెరప లేకుండా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈనెల 7వ తేదీన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కేరళకు చేరుకున్నాయి. ఎత్తయిన పర్వత ప్రాంతాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కేరళలో రేపు ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి అధికారులు తెలిపారు.