ఖమ్మం

గులాబీ జోరు.. కూటమి బేజారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, సెప్టెంబర్ 23: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎన్నికల రణరంగంలో అధికార పార్టీ టీఆర్‌ఎస్ దూకుడు ప్రదర్శిస్తోంది. గులాబీ దళపతి కేసీఆర్ ముందస్తు ఎన్నికల సిద్ధమైన రోజే ఈనెల 6న ఏకంగా జిల్లాలో టీఆర్‌ఎస్ తరుపున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించేశారు. జిల్లాకు సంబంధించి తాజా మాజీ ఎమ్మెల్యేలకే టిక్కెట్లు ఖరారవ్వడంతో అధినేత పిలుపుమేరకు వారం వారం రోజుల నుంచి జనంలోకి వెళ్తున్నారు. తమ అసెంబ్లీ పరిధిలోని గ్రామగ్రామాన గులాబీ దండుతో ప్రచారం జోరుగా చేస్తున్నారు. కాగా కాంగ్రెస్, తెదేపా, భాజపా, సీపీఐ కూటమి అంటూ పొత్తులపై వ్యూహరచనల్లోనే మునిగిపోయాయి. ఇంతవరకు కూటమి తరుపున జిల్లాలో ఒక్క అభ్యర్థిని కూడా ఖరారు చేయలేదు. కూటమి పొత్తులపై ఒక స్పష్టత వచ్చినప్పటికీ ఏ అసెంబ్లీ స్థానం కూటమిలో ఏ పార్టీకి కేటాయించాలో నిర్ణయించకపోవడంతో ఆయా పార్టీల్లో టిక్కెట్ ఆశిస్తున్న వారంతా అయోమయంలో ఉన్నారు. ఒకవైపు అధికార పార్టీ ప్రచారాన్ని ఉద్ధృతంగా సాగిస్తుండగా కూటమి నేతలు మాత్రం టిక్కెట్ల కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదగాలని ఊవ్విళ్లూరుతున్న భాజపా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒంటరిగా పోటీ చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రకటించినా ఇంకా టిక్కెట్ల కేటాయింపు జరగలేదు. ఇదిలా ఉంటే టీఆర్‌ఎస్ తప్ప ఏ పార్టీలోనూ అభ్యర్థులపై స్పష్టత రాకపోవడంతో ఆయా పార్టీల నాయకులు ఇప్పుడు ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. టిక్కెట్‌పై కనే్నసిన ఆశావహులంతా హైదరాబాద్‌లోనే మకాం వేయడంతో టీఆర్‌ఎస్ గ్రామాల్లో ప్రతిపక్షాలపై చేస్తున్న విమర్శలకు, ఆరోపణలకు సమాధానం ఇచ్చే వారే కరువయ్యారు. అక్టోబర్ నెలలో మూడవవారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందన్న సంకేతాలు వస్తున్న క్రమంలో టీఆర్‌ఎస్ తప్ప మిగతా పార్టీలు ఇప్పటివరకు టిక్కెట్ల సర్దుబాటులోనే ఉండటంతో వారికి సమయం తక్కువగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టీఆర్‌ఎస్ పెద్దపీట వేయగా వారంతా ఇప్పటికే గత నాలుగున్నరేళ్ల కాలంలో ప్రజల్లో మమేకమై ఉన్నారు. మళ్లీ తమనే గెలిపించాలని ముందస్తుగా ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యేలు ప్రతిపక్షాలకు ఓటెందుకు వేయకూడదో కూడా వివరిస్తూ ప్రజలను తమవైపు తిప్పుకుంటున్నారు. ఇటీవల టీపీసీసీ పెద్దలు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలవడం, పలు కమిటీలను ఆయన వేయడం తెలిసిందే. అయితే అభ్యర్థుల ప్రకటన కూడా ఉంటుందని భావించినా మహాకూటమి ఇంకా టిక్కెట్ల లెక్కల్లోనే ఉండటంతో జిల్లాలో ఏ అసెంబ్లీ స్థానంలో ఏ పార్టీకి అవకాశం వస్తుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. కూటమిలో ఆయా పార్టీలు ఆశిస్తున్న అసెంబ్లీ టిక్కెట్లపై ఎప్పటికప్పుడు ఊహాగానాలు రావడమే కాని అధికారికంగా ఎటువంటి ప్రకటన రాకపోవడంతో పార్టీ శ్రేణుల్లో కూడా అయోమయం నెలకొంది. జిల్లావ్యాప్తంగా ముందస్తు ఎన్నికల హడావుడి అంతా టీఆర్‌ఎస్ పార్టీలో కనిపిస్తోంది. కొన్నిచోట్ల సిట్టింగ్‌లకు టిక్కెట్లు ఇవ్వడం పట్ల అసమ్మతి నెలకొన్నా, విభేదాలు భగ్గుమన్నా అధినేత అశీస్సులతో తాజా మాజీ ఎమ్మెల్యేలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అసమ్మతిని ఎదురొడ్డి తమదైన శైలిలో ప్రజల ముందుకు వెళ్తున్నారు. పార్టీలో చేరికలను ఆహ్వానిస్తున్నారు. టీఆర్‌ఎస్ దూకుడుగా ఉంటే సీపీఎం కూడా ఇంకా అభ్యర్థుల ప్రకటన చేయలేదు. భద్రాచలం సీటును మాజీ ఎంపీ మిడియం బాబూరావుకు కేటాయిస్తారన్న దానిపై ఎటువంటి అనుమానాలకు తావులేకున్నా అధికార ప్రకటన మాత్రం ఇంతవరకు రాలేదు. ఆ పార్టీ ఇటీవలే దుమ్ముగూడెం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించింది. మొత్తంగా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు టీఆర్‌ఎస్ అభ్యర్థులు కార్యక్షేత్రంలో దిగగా.. కూటమి అభ్యర్థులు తమకు బలమున్న చోట్ల పొత్తుల్లో సీట్లు కోల్పోకుండా కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ఒంటరిగా పోటీలో ఉంటామని చెబుతున్న సీపీఎం, భాజపా ఉనికిని చాటుకునే ప్రయత్నాలను ప్రారంభించారు.