ఖమ్మం

పెండింగ్ వినతులకు ప్రాధాన్యతనివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(మామిళ్ళగూడెం), సెప్టెంబర్ 24: ప్రజల వినతులను పరిశీలించి వాటి పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకొని పెండింగ్‌లో వినతులను పరిష్కరించేందుకు ప్రాధాన్యతినివ్వాలని కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశం మందిరంలో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో ప్రజల నుండి వినతులను స్వీకరించి పరిశీలించారు. జిల్లా నలుమూలల నుండి అనేకమంది ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్‌కు విన్నవించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రీవెన్స్ దరఖాస్తులు పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలను వారంలోగా పరిష్కరించాలని ఆదేశించారు. తమ పేరుమీద 11.10ఎకరాల పొలం కల్లూరు మండలం తాళ్ళూరివెంకటాపురం రెవిన్యూ పరిధిలో ఉందని, ఆపొలంపై సర్వ హక్కులు తమకే ఉన్నాయని తహశీల్దార్ తమ పేరుమీద పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వకుండ ఇబ్బందులకు గురిచేస్తున్నారని దారెల్లి భారతి, కోటయ్య, ప్రియాంక, జెర్రిపోతుల వెంకటేశ్వర్లు, సుధాకర్‌లు కలెక్టర్‌కు విన్నవించారు. తమకు చెందిన 30 కుంటల భూమికి పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వకుండ కొణిజర్ల తహశాల్దార్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని కొణిజర్ల మండలం పెద్దగోపతి గ్రామానికి చెందిన రాయల సూరమ్మ కలెక్టర్‌కు విన్నవించారు. కామేపల్లి మండలం ముచ్చర్ల రెవిన్యూ పరిధిలోని గిరిజనుల భూమిని ఆక్రమించుకొని కుటుంబ సభ్యుల పేరుతో పాస్‌పుస్తకాలు చేయించుకున్నారని దానిని రద్దుచేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆ గ్రామానికి చెందిన ఎల్‌హెచ్‌పిఎస్ సభ్యులు కలెక్టర్‌కు విన్నవించారు.