జాతీయ వార్తలు

కన్నయ్య దేశవ్యతిరేక నినాదాలు చేయలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: దేశద్రోహం కేసులో అరెస్టయిన జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత కన్నయ్యకుమార్ ఇటీవల అఫ్జల్‌గురు జయంతి సందర్భంగా దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి నినాదాలు చేయలేదని దిల్లీ ప్రభుత్వం నిర్వహించిన న్యాయ విచారణలో తేలింది. అఫ్జల్‌గురు సంస్మరణార్థం జరిగిన ర్యాలీలో అతనికి అనుకూలంగా నినాదాలు చేసిన వారిని ఇప్పటికే జెఎన్‌యు అడ్మినిస్ట్రేటివ్ విభాగం గుర్తించిందని, ఆ జాబితాలో కన్నయ్య పేరు లేదని న్యాయ విచారణలో తేలింది. కాగా, కన్నయ్యకు షరతులతో బెయిల్ మంజూరు చేస్తూ దిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.