ఖమ్మం

కొత్తగూడెం జిల్లాపై జలగం ముద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దమ్మపేట, సెప్టెంబర్ 19: జిల్లాల పునర్విభజన, రాజకీయ పునరేకీకరణ, అధికార వికేంద్రీకరణలో జలగం కుటుంబం పాత్ర ప్రాముఖ్యతను సంతరించుకుంది. నాడు వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం జిల్లాగా అవతరించినప్పుడు జలగం వెంగళరావు కీలకపాత్ర పోషించగా నేడు ఖమ్మం జిల్లా నుంచి నూతనంగా ఏర్పడనున్న కొత్తగూడెం జిల్లా అభివృద్ధిలో జలగం వెంగళరావు తనయుడు వెంకట్రావు కీలకపాత్ర పోషించనున్నారు. 1953లో వరంగల్ జిల్లా నుంచి వేరు చేసి ఖమ్మం జిల్లాగా ఏర్పాటు చేశారు. పూర్తిగా అటవీ ప్రాంతం, సాగునీరు లేక అల్లాడుతున్న బీడు భూములతో అప్పుడు ఈ ప్రాంతం ఉంది. జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా, రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా జలగం వెంగళరావు ఖమ్మం జిల్లాలో అభివృద్ధి ఫలాలకు బీజాలు వేశారు. బీడు భూములుగా ఉండి మెట్ట పంటలైన దోస, చిలకడదుంప వంటి పంటలను సాగు చేసి బ్రతుకు భారమైన నాటి రైతాంగానికి నాగార్జున్ సాగర్ కాలువ ద్వారా కృష్ణా నీటిని తీసుకొచ్చారు. ఆ ఫలితమే నేడు లక్షలాది ఎకరాల్లో మగాణీ, మెట్ట భూములతో రెండు, మూడు పంటలు పండుతున్నాయన్నారు. ఈప్రాంతం సస్యశ్యామలంగా ఉందంటే నాడు వెంగళరావు చేసిన కృషే అని చెబుతారు. సత్తుపల్లి వంటి గ్రామాన్ని నియోజకవర్గ కేంద్రంగా, తాలూకా కేంద్రంగా చేసి వివిధ ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పూర్తిస్థాయి అభివృద్ధి చేసి నేడు కార్పొరేషన్‌గా ఎదిగింది. నేడు కొత్తగూడెం జిల్లాగా అవతరిస్తున్న ప్రాంతంలో జలగం వెంగళరావు పారిశ్రామికీకరణను నడుం బిగించారు. మణుగూరు హెవీవాటర్‌ప్లాంట్, భద్రాచలం పేపర్‌బోర్డు, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులతో పాటు ప్రైవేట్ పరిశ్రమలను ప్రోత్సహించి పారిశ్రామీకరణ దిశగా పరుగులు పెట్టించారు. ఇవే గాక తాలిపేరు, పెద్దవాగు ప్రాజెక్టు, కినె్నరసాని, మూకమామిడి వంటి ప్రాజెక్టులు చేపట్టి సాగునీటికి అవకాశాలు కల్పించారు. ఆయన తనయుడు వెంకట్రావు సత్తుపల్లి ఎమ్మెల్యేగా గోదావరి జలాలను తీసుకొచ్చి సత్తుపల్లి నియోజకవర్గ ప్రాంతం సస్యశ్యామలం చేయడానికి నడుం బిగించడమే కాక ఆ ప్రాంతంలో ఇండస్ట్రీయల్ పార్కును ఏర్పాటు చేసి పారిశ్రామీకరణ దిశగా కృషి చేశారు. నేడు కొత్తగూడెం జిల్లాగా ఏర్పడనున్న కొత్తగూడెం నియోజకవర్గంలో గిరిజనేతర శాసనసభ్యుడిగా జలగం వెంకట్రావ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు ఆయన విశేష కృషి చేస్తున్నారు. కొత్తగూడెం ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు తయారు చేసి కార్యరూపం దాల్చే ప్రయత్నం చేస్తున్నారు. నాడు జిల్లా పునర్విభజనలో, అనంతరం ఖమ్మం జిల్లా అభివృద్ధిలో జలగం వెంగళరావు కీలకపాత్ర పోషిస్తే ఏడు దశాబ్ధాల తర్వాత కొత్తగా ఏర్పడనున్న కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేకమైన నేతగా అభివృద్ధి బాధ్యతలు జలగం వెంకట్రావుకు దక్కడం విశేషం.