ఖమ్మం

ప్రశాంతంగా ఐఐటి పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపురం హవేలి, ఏప్రిల్ 3: జాతీయ స్థాయిలో ఆదివారం జరిగిన ఐఐటి పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం ఆరు కేంద్రాల్లో పరీక్షను నిర్వహించగా, మొత్తం 4,977మంది అభ్యర్థులకు గాను 4,829. హాజరయ్యారు. ఉదయం 9-30గంటల నుంచి 12-30గంటల వరకు జరిగిన బిఈ, బిటెక్ ప్రవేశ పరీక్షకు 3,883మందికి 3,805 మంది హాజరు కాగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి 5గంటల వరకు జరిగిన బిఆర్క్ పరీక్షకు 1094 మందికి 1,024 హాజరయ్యారు. 70మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ఖమ్మం నగర పరీక్షల సమన్వయ కర్త పార్వతిరెడ్డి పరీక్షా కేంద్రాలను సందర్శించారు. ఈ ఏడాది విద్యార్థులకు సిబిఎస్‌ఈ బోర్డు పెన్నులు అందించటం గమనార్హం. అర్థగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించడంతో అభ్యర్థులు ఉరుకులు పరుగులు తీయడం కనిపించింది. వివిసి పబ్లిక్ స్కూల్‌లో ఓ అభ్యర్థి కాలి నొప్పితో పరీక్ష రాసేందుకు వస్తుండగా గమనించిన పాఠశాల యజమాన్యం ఆ అభ్యర్థిని ద్విచక్ర వాహనం ద్వారా పరీక్ష కేంద్రంకు తరలించింది.

పరీక్షాకేంద్రాల వద్ద సౌకర్యాలు నిల్
ఐఐటి పరీక్షకు సుదూర ప్రాంతాల నుంచి అభ్యర్థులు రావటంతో వారి తల్లిదండ్రులు పరీక్ష ముగిసేంత వరకు చెట్ల కింద, రోడ్ల వెంట సేద తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థుల తల్లిదండ్రులు వస్తారనే విషయం తెలిసినప్పటికీ పరీక్షా కేంద్రం నిర్వాహకులు కనీస సౌకర్యాలు కల్పించకపోవటం పట్ల అభ్యర్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.