ఖమ్మం

రైతులను అన్ని విధాలా ఆదుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎర్రుపాలెం, అక్టోబర్ 23: మండలంలోని రైతు సమస్యలపై ఆదివారం కాంగ్రెస్, టిడిపి, బిజెపి, వైసిపి మరియు రైతుసంఘాల ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశమైన నాయకులు మండలంలో ప్రకృతి వైపరిత్యాల మూలంగా మరియు నకిలీ విత్తనాల ప్రభావంతో పత్తి, మిర్చి, మొక్కజొన్న మొదలైన పంటలు తీవ్రంగా నష్టపోయి రైతులు నష్టాల్లో కూరుకుపోయారన్నారు. రాష్ట్రం మొత్తంలో అధిక వర్షపాతం నమోదైనందున ఎర్రుపాలెం మండలంలో మాత్రం కనీస వర్షపాతం నమోదు కాలేదని, అందుమూలంగానే వరి పంటలు కూడా నష్టపోయాయన్నారు. అదే విధంగా ఇటీవల కురిసిన అధిక వర్షాలకు మెట్టపంటలు దెబ్బతిన్నాయని, వెంటనే నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని అఖిలపక్ష నాయకులు కోరారు. మరియు సాగర్ జలాలతో మండలంలోని అన్ని చెరువులు కట్టలేరుకు నీటినిచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. మిర్చిపంట నష్టపోయిన రైతులకు ఎకరాకు లక్ష రూపాయలు, పత్తి నష్టపోయిన రైతులకు ఎకరాకు యాబైవేలు, మొక్కజొన్నకు ముపైవేలు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. అలాగే ఇప్పటి వరకు రైతులకు మిగిలిన రుణమాఫీని ఒకేసారి మాఫీచేసి రైతులను ఆదుకోవాలని అఖిలపక్ష నాయకులు, మరియు రైతు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ప్రభుత్వం రైతులపై అలసత్వం వహించకుండా వారు కోరుకునే విధంగా నష్టపరిహారం అందించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎంతో ఉపయోగపడే విధంగా పాలన చేస్తున్నామని అంటున్నారని, ఇప్పుడు నష్టపోయిన పంటలకు స్పందించి రైతులకు న్యాయం చేసినట్లయితే నిజంగానే ప్రభుత్వానికి రైతులకు చిత్తశుద్ధి ఉన్నట్లు నిరూపించుకున్నట్లవుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, బండారు నర్సింహరావు, యన్నం వెంకటేశ్వరరెడ్డి, శీలం నర్సిరెడ్డి, కడియం శ్రీనివాసరావు, బొగ్గుల శ్రీనివాస్‌రెడ్డి, దేవరకొండ శ్రీనివాసరావు, శీలం శ్రీనివాస్‌రెడ్డి, ఎస్‌కె మస్తాన్‌వలీ, డి మోహన్‌రావు, పుల్లారావు, మల్లారెడ్డి పాల్గొన్నారు.