ఖమ్మం

నీటితొట్టిలో పడి బాలుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్ల,అక్టోబర్ 25: నీటితోట్టిలో పడి బాలుడు మృతి చెందిన విషాద సంఘటన మంగళవారం గార్ల మండలం మంగలితండాలో జరిగింది. స్థానికులు, కుటుంబుసభ్యుల కథనం ప్రకారం మంగలితండకు చెందిన కురసం అంజయ్య,సుధల మూడెళ్ళ కుమారుడి దిలీప్ ఆటలాడుకుంటూ నీటి తొట్టి దగ్గరకు వెళ్లి నీళ్ళు ముంచబోతూ అందులో పడిపోయాడు. ఆప్రక్కనే పొలం పనులు నిర్వహిస్తున అంజయ్య,సుధలు తమ కుమారుడి జాడకై వెతుకులాడుతుంటే నీటితోట్టిలో శవమై కన్పించాడు. దీంతో వారి రోదనలు మిన్నంటగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

వానరానికి దహన సంస్కారాలు
ఖమ్మం(గాంధీచౌక్), అక్టోబర్ 25: నగరంలో మంగళవారం స్థానిక ఖానాపురం హవేలి కార్యాలయంలో తెల్లవారజామున కరెంటుషాక్‌కు గురై ఒక వానరం మృతిచెందింది. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీప్రసాద్ కార్పొరేషన్ సిబ్బందికి సమాచారం అందించి చనిపోయిన వానరానికి సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఇలు, ఏఇలు, మున్సిపల్ మెనేజర్ రాజారాం, పోట్ల వీరేందర్, మచ్చ వేణు, చంద్రశేఖర్, రవికుమార్, కుక్కల శ్రీను తదితరులు పాల్గొన్నారు.