ఖమ్మం

రూటే సపరేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, నవంబర్ 6: అది ఏ రాజకీయ పార్టీ అయినా రాష్టమ్రంతా ఒక విధానముంటే ఖమ్మంకు వచ్చేసరికి అది మారుతుంది. రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాలో బలమైన పార్టీలుగా ఉన్న వామపక్షాలైనా, అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏమైనా కమిటీలు, పదవుల కేటాయింపులకు వచ్చేసరికి మరోసారి ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంటుంది. తాజాగా కాంగ్రెస్, తెలుగుదేశం, టిఆర్‌ఎస్ పార్టీల పరిస్థితి అదే. తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని 29 జిల్లాల కమిటీలను ప్రకటించినా ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల కమిటీలను మాత్రం ప్రకటించలేకపోయింది. ఇందుకు పార్టీలో ఉన్న నేతల మధ్య విభేదాలకు తోడు రాష్ట్ర కమిటీలో కూడా జిల్లాపై ఏకాభిప్రాయం రాకపోవడమే కారణంగా తెలుస్తోంది. నేతల మధ్య సఖ్యత లేకపోవడం, ఎవరికి వారు గట్టి ప్రయత్నానలు చేస్తుండటమే ఏకాభిప్రాయానికి రాకపోవడానికి ప్రధాన కారణం. టిడిపికి నామ నాగేశ్వరరావు, టిఆర్‌ఎస్‌కు తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్‌కు మల్లు భట్టివిక్రమార్క ఉన్నా వారికి ధీటుగా అధినాయకత్వానికి ప్రతిపాదనలు వెళ్తుండటం గమనార్హం. దీంతో సదరు నాయకుల వర్గీయులకు, ప్రత్యర్థి వర్గీయులకు మధ్య విభేదాలు బాహటంగానే వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లా కమిటీల నియామక విషయంలో స్పష్టమవుతున్నాయి. గడిచిన ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పరిధిలో మంచి ఫలితాలు సాధించిన తెలుగుదేశం పార్టీ ఆ తరువాత పార్టీ నేతలు ఒకరొక్కరుగా టిఆర్‌ఎస్‌లో చేరడంతో కొంత బలహీనపడింది. అయినప్పటికీ జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకోవడంలో విఫలం చెందినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఖమ్మం జిల్లా అధ్యక్షుడుగా స్వర్ణకుమారిని నియమించాలని కొందరు, బ్రహ్మయ్యనే కొనసాగించాలని మరికొందరు, వెంకటవీరయ్యకి ఇవ్వాలని ఇంకొందరు వాదిస్తుండగా కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా బ్రహ్మయ్య కోసం కొందరు, కోనేరు చిన్నికోసం ఇంకొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా అధికార టిఆర్‌ఎస్‌లో సైతం ఇదే పరిస్థితి నెలకొన్నది. పార్టీ జిల్లాలో బలంగా ఉన్నప్పటికీ రెండు జిల్లాల పరిధిలో కమిటీలను వేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. నాయకుల మధ్య విభేదాలు, వర్గాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జిల్లా పార్టీని తనదైన శైలిలో నడిపిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించిన వ్యక్తినే వ్యతిరేకించే పరిస్థితి నెలకొన్నది. కొత్తగూడెం జిల్లా పరిధిలో అయితే జలగం, తుమ్మల వర్గీయులు పోటాపోటీగా జాబితాలను అధినేతకు అందజేశారు. రాష్ట్రంలోని మెజార్టీ జిల్లాల కమిటీల నియామకంపై ఏకాభిప్రాయానికి వచ్చిన టిఆర్‌ఎస్ అధినేతలు ఖమ్మం, కొత్తగూడెం విషయంలో మాత్రం ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. బేగ్‌కోసం కొందరు, పోట్ల కోసం మరికొందరు, కొండబాల కోసం ఇంకొందరు ప్రయత్నిస్తుండగా, కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా తాళ్ళూరి వెంకటేశ్వరరావు కోసం కొందరు, దిండిగాల రాజేందర్ కోసం మరికొందరు, నరేందర్ కోసం ఇంకొందరు ప్రయత్నిస్తున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం ఉన్న ఐతం సత్యంనే కొనసాగించాలని అత్యధికులు డిమాండ్ చేస్తుండగా కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా వనమా వెంకటేశ్వరరావు, వనమా రాఘవ, రేగా కాంతారావుల మధ్య పోటీ నెలకొన్నది.