ఖమ్మం

కార్పొరేట్లకు రుణమాఫీ చేయటం తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(గాంధీచౌక్), నవంబర్ 18: బ్యాంకులను మోసం చేసిన కార్పొరేట్లకు రుణమాఫి చేయటం దారుణమని ఎల్‌హెచ్‌పిఎస్ జిల్లా కన్వీనర్ బాణోత్ భద్రునాయక్ అన్నారు. శుక్రవారం సంఘ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలు దాచుకున్న సొమ్మును కార్పొరేట్లకు ధారాదత్తం చేసిన బ్యాంకులు తిరిగి సొమ్మును స్వాధీనం చేయకుండా నిరర్ధక సొమ్ముగా ప్రకటించటం ఎంతమాత్రం సమంజసం కాదన్నారు. నోట్ల రద్దు నిర్ణయం మంచిదేకాని ప్రజల ఇబ్బందులను ముందుగా గ్రహించకపోవటం విచారకరమన్నారు. దేశంలో 86శాతం పెద్దనోట్ల చెలామణిలో ఉందని, దానికి అనుగుణంగా ప్రభుత్వం కొత్త నోట్లను విడుదల చేయాలన్నారు. విదేశాల్లో దాదాపు 30శాతం నల్లధనం ఉన్నట్లు అంచనా ఉండగా ఆ ధనాన్ని వెలికితీయటానికి ఈ చర్యలు సరిపోవన్నారు. ప్రస్తుతం రబీకి సిద్ధమవుతున్న రైతాంగం నగదు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి వద్ద ఉన్న నగదును ఎలా మార్చుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో రైతులు ఉన్నారన్నారు. వారికి అధికారులు సహకారం అందించాలని కోరారు. బ్యాంకులు కార్పొరేట్లకు రుణమాఫి చేసిన విషయాన్ని అన్ని పార్టీలు, వివిధ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో నాయకులు బి వెంకటేశ్వర్లు, బాస్కర్, నరేష్, వెంకట్, నాగరాజు, రమేష్, శ్రీను, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.