ఖమ్మం

పార్టీ అభ్యున్నతికి కృషిచేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(జమ్మిబండ), నవంబర్ 18: జిల్లాలో బిజెపి అభ్యున్నతికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు సనె్న ఉదయ్‌ప్రతాప్ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత అనుభవాలతో ప్రతి కార్యకర్తని కలుపుకొని పార్టీ అభివృద్ధికి పాటుపడుతానన్నారు. విద్యార్థి సమస్యలపై పోరాటాలు, ఆర్‌ఎస్‌ఎస్‌లో స్వయం సేవక్‌గా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేసిన తాను జిల్లా అధ్యక్షుడిగా ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపడుతానన్నారు. గ్రామ, మండల స్థాయి నుండి పార్టీ బలోపేతానికి తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రధాని నరేంద్రమోడీ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచారన్నారు. మోడీ తీసుకున్న నిర్ణయాల వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర కమిటీల పిలుపు మేరకు ప్రజా సమస్యలపై తన వంతుగా ప్రయత్నిస్తానన్నారు. రాబోయే కాలంలో జిల్లాలో పార్టీని ఉన్నతంగా ఉంచేందుకు కృషి చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ సెంటిమెంట్‌తో మోసం చేస్తున్న కెసిఆర్

ఖమ్మం(జమ్మిబండ), నవంబర్ 18: తెలంగాణ సెంటిమెంట్‌ను అధికారం దక్కించుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజలను మభ్యపెట్టి మోసపూరిత పాలన కొనసాగిస్తున్నాడని సిపిఐ సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఖమ్మం గ్రామీణ మండలం కాశిరాజుగూడెం గ్రామంలో గ్రామీణ, మండల మహాసభ ఏలూరి రామచందర్‌రావు ప్రాంగణంలో జరిగాయి. ఈ సందర్భంగా పువ్వాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన కెసిఆర్ మాయమాటలతో పబ్బం గడుపుతున్నారన్నారు. ఆనాడు ఇచ్చిన మాటలకు విలువ లేకుండా పోయిందని, రెండున్నరేళ్ళలో ఒక్క హామీని కూడా అమలుకు నోచుకోలేదన్నారు. అభద్రతా భావంతోనే ఇతర పార్టీలకు చెందిన 24మంది శాసన సభ్యులను తన పార్టీలోకి చేర్చుకొని ఫిరాయింపులను ప్రోత్సహించిన కెసిఆర్‌ను ప్రజలు క్షమించరన్నారు. రాష్ట్రంలో కెసిఆర్ ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి కుటుంబ పాలన కొనసాగిస్తున్న కెసిఆర్ రానున్న కాలంలో తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఉవ్వెత్తున కెరటంలా ఎగిరిపడిన పార్టీలకు పతనం తప్పదని, దానికి ఉదాహరణ తెలుగుదేశం పార్టీనేనన్నారు. టిఆర్‌ఎస్‌కు కూడా భవిష్యత్తులో అదే గతి పట్టక తప్పదన్నారు. మతతత్వ పార్టీలతో దేశానికి ముప్పు ముంచుకొస్తుందని, నరేంద్రమోడీ తీసుకున్న నిర్ణయాలతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. దేశంలో మతతత్వ పార్టీ బిజెపి విధానాలతో దేశ ప్రజలు సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమన్నారు. ఇటీవల రద్దుచేసిన పెద్దనోట్ల వల్ల పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, నరేంద్రమోడీ బడా బాబులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. పెద్దనోట్ల రద్దుకు ప్రత్యామ్నయ చర్యలు తీసుకొని దేశ ప్రజలు పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం చూపాలన్నారు. ఈ సభలో పార్టీ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, నాయకులు రామయ్య, వౌలానా, సురేష్, రంగారావు, కర్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.