ఖమ్మం

ప్రేమ విఫలమై యువతి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మధిర, ఏప్రిల్ 5: ప్రేమ విఫలమై ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం మధిర పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మధిర పట్టణానికి చెందిన వేమిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి స్థానిక ఆజాద్ రోడ్డులోని ఐశ్వర్య అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. అతని కుమార్తె వేమిరెడ్డి లలిత (23) మధిరలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి వేద మోహన్‌కుమార్ అనే విద్యార్థితో ప్రేమలో పడింది. గత ఏనిమిది సంవత్సరాలు వీరి ప్రేమ కొనసాగుతోంది. ఇటీవల మోహన్‌కుమార్ పెళ్లికి నిరాకరించటంతో మనస్తాపం చెందిన లలిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు టౌన్ ఎస్‌ఐ తిరుపతిరెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.