ఖమ్మం

ముక్కోటి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, నవంబర్ 18: భద్రాచలంలో వచ్చే ఏడాది జనవరి 8,9 తేదీల్లో జరిగే ముక్కోటి వైకుంఠ ఏకాదశి మహోత్సవాల వైభవోపేతంగా నిర్వహించాలని, నిర్వహణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి మహోత్సవాలపై శుక్రవారం ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ తొలుత భక్తుల భద్రతకై పోలీసుశాఖ తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. హోంగార్డు నుంచి డీయస్పీ వరకు ఉత్సవ ప్రాంతాన్ని 1150 మంది సిబ్బందితో కట్టుదిట్టం చేయడం జరుగుతుందని, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని డీయస్పీ అశోక్‌కుమార్ కలెక్టర్‌కు వివరించారు. ముక్కోటి ఉత్సవాలకు 40వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున గోదావరి తీరప్రాంతంలో స్నానమాచరించే స్ధలాల వద్ద లోతు తెలిపే సూచికల ఏర్పాట్లు, బారికేడ్లు, గజ ఈతగాళ్ల ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని, విధులు నిర్వహించే ప్రతి ఒక్కరికి డ్యూటీపాస్ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. పారిశుద్ధ్య ఏర్పాట్లపై జిల్లా పంచాయితీ అధికారిణి ఆశాలత వివరిస్తూ గ్రామ పంచాయితీలో ఉన్న ట్రాక్టర్లకు అదనంగా మరో 6 ట్రాక్టర్లుర తీసుకుని పారిశుద్ధ్య చర్యలు చేపడతామని, మంచినీటి ట్యాంకర్లను అదనంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండేందుకు 16 టీమ్‌లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. 40 తాత్కాలిక మరుగుదొడ్లకు 20 ఒకచోట, మరొచోట 20 నిర్మిస్తున్నామని ఆర్‌డబ్య్లూఎస్ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. అలాగే 24 గంటలు తాగునీరు అందించేందుకు 20 పంపులను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. దేవాదాయ, నీటి పారుదల, మత్స్యశాఖ అధికారులు గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తెప్పోత్సవానికి వినియోగిస్తున్న హంసవాహనం సామర్ధ్యం ధ్రువీకరించి అనుగుణంగా చర్యలు తీసుకున్నట్లు తనకు ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యుత్, జనరేటర్, డెకరేషన్ హంసవాహనంలో ఉంటున్నందున భద్రత చర్యలు చేపట్టాలన్నారు. 105 ప్రత్యేక బస్సులు నడుపుతామని, అవసరాన్ని బట్టి అదనంగా సర్వీసులు నడిపుతామని ఆర్టీసీ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. పోలీసుశాఖతో సమిష్టిగా పనిచేసి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్టీసీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఉత్సవాలను ప్రత్యక్షంగా తిలకించే వారికన్నా టీవీల ద్వారా వీక్షించే వారి సంఖ్య అధికంగా ఉంటుందని, ఉత్సవాలు ఆద్యంతం ప్రత్యక్షప్రసారం చేసేందుకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌కు తప్ప మరొకరికి అనుమతి ఇవ్వరాదని కలెక్టర్ చెప్పారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఈ ప్రాంత పర్యాటక రంగంపై విస్తృత సమాచారం ఇచ్చేందుకు ప్రధాన ప్రాంతాల్లో స్టాల్స్ ఏర్పాటు చేయాలని, కినె్నరసాని వంటి అందమైన పర్యాటక ప్రాంతాలపై ఆకర్షణగా బ్రోచర్‌ను ముద్రించి ప్రచారం చేపట్టాలని ఆదేశించారు. అనంతరం వైద్యశాఖ ఏర్పాట్లను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. కళ్యాణమండపం, గోదావరి తీర ప్రాంతం, బస్టాండ్, తానీషా కల్యాణమండపం తదితర చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన, విస్తాకాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసే శిబిరం 24 గంటలు పని చేస్తుందన్నారు. 108 వాహనాలు కూడా అందుబాటులో ఉంచుకున్నామని, ఏరియా ఆసుపత్రిలో కూడా అన్ని సౌకర్యాలు ఉన్నట్లు సంబంధిత అధికారులు వివరించారు. పర్ణశాలలో కూడా శిబిరం ఏర్పాటు చేస్తామన్నారు. పిల్లలు, వృద్ధులను దృష్టిలో ఉంచుకుని ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆ శాఖ అధికారులకు సూచించారు. ఉత్సవాల రెండురోజుల పాటు మద్యం విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్‌శాఖను ఆదేశించారు. భక్తులకు పర్యాటక ప్రాంతాల ప్రయాణ దూరం, టిక్కెట ధర, హోటళ్లలో ధరలను వివరిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే చర్యలు తీసుకునేందుకు సెల్ నెంబర్లను కూడా ముద్రించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు. ముక్కోటి ఉత్సవాల ప్రచారంలో పౌర సంబంధాల శాఖ అధికారులతో పాత్రికేయులు సమన్వయంతో పోవాలని, పాస్‌ల విషయంలో నియంత్రణ పాటించాలని కోరారు. ముక్కోటి ఉత్సవాలపై ప్రత్యేక వెబ్‌సైట్ రూపొందించి టిక్కెట్ల విక్రయానికి కృషి చేయాలని, భక్తులకు స్వచ్చంధ సంస్థలు సేవలందించాలన్నారు. అధికారులంతా సమిష్టిగా పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ముక్కోటి ఉత్సవాలపై రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రచారం చేయాలని, ఆర్టీసీ, రైల్వేశాఖ అధికారులతో పోస్టర్లు, స్టిక్కర్లు ముద్రించి ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎంవీ రవీంద్రనాధ్, దేవస్థానం ఈవో రమేష్‌బాబు, డీయస్పీ అశోక్‌కుమార్, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.